తమిళనాడు గవర్నర్ రోశయ్య మెడకు మరో భూవివాదం

Rosaiah
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు తమిళనాడు గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను మరో వివాదంలోకి లాగారు. హైదరాబాద్ నడిబొడ్డున గల రూ.మూడు వందల కోట్ల విలువైన ఏడెకరాల భూమిని ఓ ప్రయివేటు వ్యక్తికి కట్టబెట్టడం అనుమానాలకు తావిస్తోందని విహెచ్ మంగళవారం పేర్కొన్నారు. ఈ భూమిని ఉర్దూ, తెలుగు మీడియం పాఠశాలలు, ఆడిటోరియం కోసం కేటాయించారని ఆయన తెలిపారు.

అంబర్‌పేటలోని ఈ భూమిని రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బహరుద్దీన్, ఇతరుల పేర్ల మీద రెగ్యులరైజ్ చేశారు. 2009 సెప్టెంబర్‌లో రోశయ్య బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకే ఈ భూమిని రెగ్యులరైజ్ చేశారు. విహెచ్ చెప్పిన ప్రకారం... ఈ భూమి నిబంధనలకు విరుద్ధంగా ప్రయివేటు వ్యక్తుల పరం అయింది. అంతేకాకుండా బహరుద్దీన్ దరఖాస్తు చేసుకున్న నాలుగు నెలల్లోనే రెగ్యులరైజేషన్ పూర్తయింది.

రోశయ్య ప్రభుత్వం బహరూద్దీన్ పేరు మీద భూమి రిజిస్టర్ చేయగానే పూర్తి కావొస్తున్న పాఠశాల భవనం నిర్మాణం ఆగిపోయింది. ఇందులో భారీ కుంభకోణం ఉండవచ్చునని విహెచ్ అనుమానాలు వ్యక్తం చేశారు. భూమి రెగ్యూలరైజేషన్ పైన స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ద్వారా కూడా స్థానికుల నుండి వ్యతిరేకత వచ్చినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా విహెచ్ ఇందుకు సంబంధించిన పత్రాలను విడుదల చేశారు.

ఈ ఏడెకరాల భూమిలో నీరు - మీరు కార్యక్రమం క్రింద నీటి కుంటను ఏర్పాటు చేసే విధంగా 1998లోనే సర్క్యులర్‌ను ప్రభుత్వం జారీ చేసిందని చెప్పారు. అందుకు అనుగుణంగా నెం.10/2002 నోటిఫికేషన్ విడుదలయింది. ఆ తర్వాత ఎంసిహెచ్ కమిషనర్ భూ ఆక్రమణను నిరోధించేందుకు రూ.85 లక్షలను బేస్‌మెంట్ నిర్మాణం కోసం విడుదల చేశారు. అదే సమయంలో సయద్ అజమ్, అతని కుటుంబ సభ్యులు రెగ్యులరైజేషన్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పైన విచారణ జరిపిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఐవి సుబ్బారావు వారి దరఖాస్తును నిరాకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+