ఫ్లై ఓవర్ పైనుంచి పడిన చెన్నై బస్సు, ఒకరి మృతి

Bus falls off Anna Salai Gemini flyover in Chennai
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నా సాలై జెమినీ ఫ్లై ఓవర్ పైనుంచి సిటీ బస్సు కింద పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 30 మంది దాకా గాయపడ్డారు. గాయపడినవారిలో కొంత మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు పూర్తిగా ధ్వంసమైనట్లు టీవీ దృశ్యాలను బట్టి అర్థమవుతోంది.

అతి వేగం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మలుపు తిరుగుతుండగా బస్సు అదుపు తప్పి ఫ్లై ఓవర్ గోడకు ఢీకొట్టి కింద పడిపోయింది. అయితే, బ్రేకులు ఏమైనా ఫెయిల్ అయ్యాయా అనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన స్థలంలో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ట్రాఫిక్‌ను ఇతర మార్గాల ద్వారా మళ్లించారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే అధికారులు చేరుకోవడంతో చాలా వరకు ఊరట లభించింది.

ప్రమాదానికి గురైన 17ఎం నెంబర్ బస్సు ప్రయాణిస్తున్న ఫ్లై ఓవర్‌ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అయితే, ఇంత వరకు ఏ విధమైన ప్రమాదాలు జరగలేదు. బస్సు కింద పడగానే పొగలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అగ్నిమాపక దళాలు వెంటనే చేరుకుని మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+