అందుకే వేధింపులు, ఓర్వలేక పోతున్నారు: నిత్యానంద

Nithyananda Swamy
బెంగళూరు/చెన్నై: తాను బ్రాహ్మణేతరుడిని కావడం వల్లనే కొందరు తనను ఉద్దేశ్య పూర్వకంగా వేధిస్తున్నారని రాసలీలల కేసులో ఇరుక్కున్న నిత్యానంద స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తాను నిర్దోషిగా బయటపడతానని చెప్పారు. తన మఠానికి అంతర్జాతీయంగా లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో మాఫియా, ఒక వర్గం మీడియా చేతులు కలిపాయని, వారి పేర్లను బయటపెడితే మరిన్ని సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

తనపై అభియోగాలు అన్ని పూర్తి అవాస్తవాలని అన్నారు. మఠాలలో ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలు జరగడం లేదని చెప్పారు. మధురై ఆధీనం మఠం వారసుడిగా తనను ఎంపిక చేయడం ఇష్టం లేని కొన్ని శక్తులు అక్కడ కూడా ఇదే విధంగా కుట్ర పన్నాయని విమర్సించారు. కాగా మధురైలోని ఆధీనం మఠంలో పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.

వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలు రావడంతో ఈ పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు. ఆశ్రమంలో ఏనుగు తొండాల కోసం, పులి చర్మాల కోసం పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు. నిత్యానంద స్వామి మధురై మఠంలో పులి చర్మంపై కూర్చున్నారని, దానిపై ఏనుగు తొండాలు పరిచి ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇంతకు ముందు కేసు నమోదు చేశారు.

ఆ సమయంలో మఠంలో ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సినీ నటి రంజితపై, మహిళా పిఆర్వోపై కూడా పోలీసులు కేసులు పెట్టారు. నిత్యానంద స్వామి పానీయం తాగించి, ఆ తర్వాత ఆంగ్ల పాటలకు నృత్యం చేయాలని సూచించేవాడని, అతని బృందం సభ్యులు కూడా ఆ ఆదేశాలు ఇచ్చేవారని పిటిషనర్ ఆరోపించారు. అయితే, ఇందుకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు రాబట్టలేకపోతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+