చిరుకు ఓకే చెప్పిన రఘువీరా: వర్షం కురిపిస్తారు.. జెసి

JC Diwakar Reddy - Raghuveera Reddy
న్యూఢిల్లీ: 2014 ఎన్నికలకు చిరంజీవే నాయకుడని తమ పార్టీ అధిష్టానం చెబితే తప్పకుండా అంగీకరిస్తామని మంత్రి రఘువీరా రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో చెప్పారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మంత్రులు గంటా శ్రీనివాస రావు, సి.రామచంద్రయ్య, పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ బుధవారం ఎపి భవనంలో రఘువీరాను కలిశారు. ఈ సందర్భంగా చిరు, రఘువీరాలు అరగంటకు పైగా చర్చలు జరిపారు. అనంతరం రఘువీరా మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో నాయకత్వ మార్పు అవసరమని తాను భావించట్లేదని, అయితే ఒళ్లు దగ్గర పెట్టుకుని మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని అన్నారు. చిరంజీవి.. ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లినట్లు తెలుసుకుని తాను ఫోన్ చేశానని, దీంతో ఎపి భవన్‌లో ఉన్న తన ను ఆయన కలిసి వెళ్లారని చెప్పారు. తమ మధ్య రాజకీయ చర్చలేమీ జరగలేదని వెల్లడించారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పును నిర్ణయించేది తాను కాదని, మేడమ్ అని స్పష్టం చేశారు. మేడమ్‌ను తాను కలవట్లేదని, చిరంజీవి ద్వారా తన అభిప్రాయాన్ని పంపించేందుకు ఆయనేమీ సమాచార వాహకుడు కాదని, స్వతహాగా లీడర్ అని అన్నారు.

రాష్ట్రంలో బాధ్యత అంతా ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్‌లదే అని అనుకోవటం సరికాదని.. లాభ నష్టాలు, మంచి చెడులకు అందరి బాధ్య తా ఉంటుందన్నారు. ఒక ఎన్నికల్లో జరిగింది ఏదీ శాశ్వతం కాదని, ప్రతిసారీ రాజకీయం మారుతూనే ఉంటుందని చెప్పారు. పార్టీ పరిస్థితిని సమీక్షించటానికే సిఎం, పిసిసి అధ్యక్షుడు కలిసి కొందరు మంత్రులతో కమిటీ వేశారని, దీనిపై తాము సమావేశమై చర్చిస్తామని అన్నారు. పిఆర్పీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య కానీ, ఏవైనా గ్రూపులు, వ్యక్తుల మధ్య కానీ సమన్వయ లోపం ఉంటే పరిశీలిస్తామన్నారు.

తెలంగాణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని, వారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తామంతా కట్టుబడి ఉంటామని అన్నారు. నాయకత్వ మార్పు అవసరం లేదని, అయితే కష్టపడి ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేయాలన్న చిరు వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. హైకమాండ్ చెబితే చిరంజీవి నాయకత్వాన్ని అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు తప్పకుండా అని చెప్పారు.

ఢిల్లీలో బుధవారం సోనియాతో భేటీ అనంతరం మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాలు కురవడం లేదని, నీళ్లు కావాలని సోనియాను అడిగానని, తప్పకుండా వర్షాలు కురిపిస్తానని ఆమె హామీ ఇచ్చారని వ్యాఖ్యానించారు. విభజన అంశంపై రాష్ట్రంలో నెలకొన్న రావణ కాష్టాన్ని తక్షణం ఆర్పాలని తాను అధినేత్రిని కోరినట్లు చెప్పారు. అయితే అది ఎప్పుడనేది తెలియదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+