జైల్లో జగన్‌ను కలిసిన రాం జెత్మలానీ, సాయిరెడ్డి

శిక్షపడిన ఖైదీకి కూడా రాజ్యాంగబద్దమైన హక్కులుంటాయని ఆయన అన్నారు. రిమాండ్‌లో వైయస్ జగన్ హక్కులను ప్రభుత్వం హరించిందని ఆయన విమర్శించారు. వైయస్ జగన్‌ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేశారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని మీడియా, ప్రభుత్వం, అన్ని వర్గాలూ గమనించాలని ఆయన అన్నారు.
ఇదిలా వుంటే, వైయస్ జగన్‌ను విచారించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైదరాబాదులోని నాంపల్లి కోర్టు జులై 2వ తేదీకి వాయిదా వేసింది. ఎమ్మార్, గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్ ఆస్తుల కేసుల్లో జైలులో ఉన్న నిందితులను ఈడి ఇప్పటికే విచారిస్తోంది.
కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై వచ్చే నెల 4వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సిబిఐని ఆదేశించింది.












Click it and Unblock the Notifications