లగడపాటి కోట్ల రూపాయల మోసం: జగన్ పార్టీ నేత

లగడపాటి రాజగోపాల్ ప్రజల నుంచి సేకరించిన వందల కోట్ల రూపాయలను తీసుకుని వెళ్లి ఆస్ట్రేలియాలో నష్టాల్లో ఉన్న గ్రిఫిన్ అనే కోల్ కంపెనీని కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. గ్రిఫిన్ కంపెనీ పత్రాలను తీసుకుని వచ్చి ఐసిఐసిఐ బ్యాంకులో కుదువ పెట్టి 3 వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ల్యాంకో ఇన్‌ఫ్రా షేరు భారీగా పతమైందని, ఐసిసిఐసి బ్యాంకుతో పాటు ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయారని ఆయన చెప్పారు.
రాజగోపాల్ ల్యాంకో ఇన్‌ఫ్రా ఉదంతంపై సిబిఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెబి కూడా దర్యాప్తు చేపట్టాలని ఆయన కోరారు. ఈ సంస్థలు స్పందించకపోతే న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. లగడపాటి రాజగోపాల్‌పై లోకసభ స్పీకర్ మీరా కుమార్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications