13 ఏళ్ల విద్యార్థినికి వేధింపులు, ఉపాధ్యాయుడి అరెస్ట్

ప్రత్యేక క్లాస్‌కు హాజరుకావాలని విద్యార్థినిని పిలిపించుకొని అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఆమెను ఆ పాఠశాల మాన్పించి రాంనగర్‌లోని ఓ పాఠశాలకు పంపిస్తున్నారు. అక్కడ మేనమామ ఇంట్లో ఉండి విద్యార్థిని చదువుకుంటోంది. ఈ ఏడాది రాంనగర్‌లోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతిలో చేరింది. ఆ విషయం తెలుసుకున్న మధు సురేష్ ద్వి చక్ర వాహనంపై బుధవారం అక్కడకు వచ్చాడు.
బాలిక చదవుతున్న స్కూలు వద్దకు వెళ్లి, ఆమెను బలవంతంగా వాహనంపై ఎక్కించుకొని వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో బాలిక మామయ్య అక్కడికి చేరుకొని, అతనిని పట్టుకొని చితకబాదాడు. మధు సురేష్ అతడిని నెట్టేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. విద్యార్థిని పేరంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఓ గృహిణిపై అత్యాచారం చేసి.. హత్య చేసి ఆపై దోపిడీకి పాల్పడిన నిందితుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కందుకూరు మండలానికి చెందిన రవీందర్ గత సంవత్సరం ఒంటరిగా వెళుతున్న ఓ మహిళపై అత్యాచారం చేశాడు. అనంతరం చీరకొంగుతో గొంతు బిగించి హత్య చేసి ఒంటిపై ఉన్న నగలు దోచుకొని వెళ్లాడు. ఈ కేసులో బుధవారం కోర్టు అతనికి శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications