రాష్ట్రపతి ఎన్నిక: ప్రణబ్ ముఖర్జీ నామినేషన్ దాఖలు

మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు ప్రతినిధులు రాలేదు. ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీకి 63 శాతం ఓటర్ల బలం ఉండగా, ప్రత్యర్థి పిఎ సంగ్మాకు 30 శాతం ఓట్ల బలం ఉంది. మిగతా ఏడు శాతం ఓట్లు గల పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయలేదు. తృణమూల్ కాంగ్రెసు, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు, తదితర పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తారనే విషయాన్ని తేల్చుకోలేదు.
ప్రణబ్ ముఖర్జీ దాఖలు చేసిన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాల్లో ముఖ్యమైన 480 మంది సంతకాలున్నాయి. జనతాదళ్ (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ కూడా నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. మాయావతి నాయకత్వంలోని బిఎస్పీ కూడా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇస్తోంది. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ మీడియాతో మాట్లాడారు.
యుపిఎలో లేని పార్టీ మద్దతు కూడా తనకు ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరును ప్రతిపాదించడం తనకు ఎంత గౌరవప్రదమని ఆయన అన్నారు. శరద్ పవార్ (ఎన్సీపి), టీఆర్ బాలు (డిఎంకె), ఫరూఖ్ అబ్దుల్లా (ఎన్‌సి), ఇ అహ్మద్ (ఐయుఎంఎల్) కూడా ప్రణబ్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ భాగస్వామ్య పక్షాలు జెడి (యు), శివసేన కూడా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు పలికాయి.












Click it and Unblock the Notifications