ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా లేడీ ఐఎఎస్ మాథ్యూస్

Minnie Mathew
హైదరాబాద్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మహిళా ఐఎఎస్ అధికారి మిన్నీ మాథ్యూస్ నియమితులయ్యారు. పంకజ్ ద్వివేది పదవీ కాలం శనివారంతో ముగిసింది. దీంతో ఆయన స్థానంలో మిన్నీ మాథ్యూస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఆమె ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుసుకున్నారు. ఆ తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రెండో మహిళా ఐఎఎస్ అధికారి మిన్నీ మాథ్యూస్. అంతకు ముందు సతీ నాయర్ 2002లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ ఇద్దరు ఐఎఎస్ అధికారులు కూడా కేరళకు చెందినవారే కావడం విశేషం.

ఇప్పటి వరకు మిన్నీ మాథ్యూస్ భూపరిపాలన చీఫ్ కమీషనర్‌గా ఉన్నారు. మాథ్యూస్ 2013 ఫిబ్రవరి 28వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. 1975 బ్యాచ్‌కు చెందిన పంకజ్ ద్వివేదీకి మరో మూడు నెలల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగడానికి పొడగింపు ఇస్తారని భావించినప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మిన్నీ మాథ్యూస్ నియామకానికే ప్రాధాన్యం ఇచ్చారు.

సీనియర్లను పక్కన పెట్టి దినేష్ రెడ్డిని డిజిపిగా నియమించడంతో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రి మిన్నీ మాథ్యూస్ నియామకానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. దినేష్ రెడ్డి నియామకంపై అసంతృప్తి చెందిన ఐపియస్ అధికారి గౌతం కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు సిద్ధపడిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+