వైయస్ జగన్‌పై మరో కేసు: హెటెరో అంశంపై ఛార్జీషీట్

ఈ ఛార్జీషీట్ దాఖలు చేసిన సిబిఐ జగన్ పైన మరో కేసు నమోదు చేసింది. పిసి యాక్ట్ సెక్షన్ 9 క్రింద ఈ కేసును నమోదు చేశారు. వైయస్ జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వాధికారులను ప్రభావితం చేశారని సిబిఐ తాజా ఛార్జీషీటులో పేర్కొంది. జగన్ కంపనీలలోకి లంచాల రూపంలో పెట్టుబడులు వచ్చాయని ఆరోపించారు. హెటరో తదితర కంపెనీలు జగన్ కంపెనీలలో రూ.146 కోట్లు పెట్టుబడులు పెట్టాయని చెప్పారు.
ఇవన్నీ లంచాల రూపంలోనే వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు తాము దాఖలు చేసిన ఛార్జీషీట్లలోని రూ.35 కోట్లు లంచం రూపంలోనే జగన్ కంపెనీలలోకి వచ్చాయన్నారు. ఈ సందర్భంగా సిబిఐ కోర్టుకు ఆధారాలను సమర్పించింది. ఇద్దరు సాక్ష్యులను తమ ఛార్జీషీటులో ప్రస్తావించింది.
కాగా జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ ఇప్పటికే మూడు ఛార్జీషీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తొలుత మొదటి ఛార్జీషీట్ దాఖలు చేసిన సిబిఐ ఆ తర్వాత మూడింటిని అనుబంధ ఛార్జీషీట్లుగా కోర్టుకు సమర్పించింది. కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి చంచల్‌గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications