రాహుల్‌తో భేటీ ఉంటుందో, లేదో చెప్పలేను: పాల్వాయి

రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ముఖ్యమంత్రి మార్పు ఉండదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని ఆయన అన్నారు.
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉన్నదని, దానిపై తెలంగాణకు చెందిన మంత్రులు, శానససభ్యులు మాట్లాడకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు, శానససభ్యులు ముఖ్యమంత్రి భజన మానాలని ఆయన సూచించారు. నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కె. జానా రెడ్డి వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారని, నాగార్జున సాగర్ నీటి మట్టం 510 అడుగులకు చేరితే హైదరాబాదుకు నీరు ఇవ్వడం కష్టమని ఆయన అన్నారు.
రాష్ట్ర పరిస్థితులపై దృష్టి పెట్టిన రాహుల్ గాంధీ చర్చల కోసం పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని ఢిల్లీకి ఆహ్వానించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైయస్ జగన్ ప్రాబల్యంపైనా, తెలంగాణ అంశంపైనా రాహుల్ గాంధీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డితో మాట్లాడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఆయన పాల్వాయితో మాట్లాడుతారు.












Click it and Unblock the Notifications