2జి దెబ్బకు పవార్ ఠా: ఈజిఓఎం అధ్యక్ష పదవికి నో

Sharad Pawar
న్యూఢిల్లీ: 2జి కుంభకోణం తర్వాత అందుకు సంబంధించిన పదవి అంటేనే కేంద్ర ప్రభుత్వంలో వణుకు పుడుతున్నట్లుగా కనిపిస్తోంది. టెలికాం వ్యవహారాలపై ఏర్పాటు చేసిన సాధికారక మంత్రుల బృందం(ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) అధ్యక్ష పదవిని వదులుకున్నారు. సోమవారం ఆయన ఈ పదవికి రాం రాం చెప్పారు. మాజీ కేంద్రమంత్రి, రాష్ట్రపతి యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ రాజీనామా తర్వాత ఈ పదవిని పవార్‌కు అప్పగించారు.

అయితే ఎటు పోయి ఎటు వస్తుందో అన్న భయంతో శరద్ పవార్ ఆ పదవిని వదులుకున్నారు. పదవిని కట్టబెట్టిన మూడు రోజులలోనే ఆయన ఆ పదవిని వదులుకున్నారు. సోమవారం పవార్ నేతృత్వంలోని మంత్రుల బృందం సమావేశం జరగాల్సి ఉంది. అయితే ముందుగా సమావేశాన్ని వాయిదా వేసిన పవార్, ఆ తర్వాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఓ లేఖ రాశారు.

2జి స్పెక్ట్రం కుంభకోణంలోకి తనను లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో ఈజివోఎం పదవిని వదులుకోవడమే తనకు సరైనదని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తన వినతికి ప్రధానమంత్రి సమ్మతి తెలిపారని పవార్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా 2జి కుంభకోణం కేసులో లబ్ధిదారైన ఓ టెలికం కంపెనీని ప్రమోట్ చేసిన ఓ సంస్థతో శరద్ పవార్‌కు సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. వాటిని అప్పుడే పవార్ ఖండించారు.

కాగా 2జి కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇది రూ.లక్షా డెబ్బయి అయిదువేల కుంభకోణమనే ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన మాజీ కేంద్రమంత్రి రాజా ఇటీవల వరకు జైలులో ఉండి బెయిల్ పైన విడుదలయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+