నారాయణ వర్సెస్ రాఘవులు: మిత్రవైరుధ్యంతో లేఖ

తాము ఎన్నడూ అలాంటి ఆలోచన చేయలేదని రాఘవులు స్పష్టం చేశారు. ప్రజల్లో తమకు ఉన్న పునాదిని నిలబెట్టుకోవడానికే ఇటీవలి ఉప ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. వామపక్షాలకు ప్రజల్లో ఉన్న పట్టును నిలుపుకునేందుకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్ోల కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడి పోరు సాగించాల్సిన అవసరం ఉందని రాఘవులు గుర్తు చేశారు.
ఇటీవల తమ రాష్ట్ర కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాఘవులు నారాయణకు ఆ లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ అవకాశవాదం, అవినీతిలో మునిగిపోయాయని రాఘవులు విమర్శించారు. కుల, మత, ప్రాంతీయ తత్వాలతో ప్రజలను ఓట్ల కోసం వినియోగించుకుంటున్నాయని ఆయన విమర్శించారు. ఈ స్థితిలో ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిన కమ్యూనిస్టు పార్టీలు ప్రజల చైతన్యాన్ని సంఘటితం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఇటీవలి ఉప ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ చెరో దారి పట్టాయి. సిపిఎం ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయగా, తెలంగాణలోని పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితికి, ఇతర నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సిపిఐ మద్దతు ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో కలిసి నారాయణ తిరుపతిలో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. ఉభయ కమ్యూనిస్టుల మధ్య విభేదాలను తొలగించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు రాఘవులు తాజా లేఖ తెలియజేస్తోంది.












Click it and Unblock the Notifications