ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు చేదు అనుభవం

ఆ తర్వాత ఆయన అల్లూరి సీతారామారాజు జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు అల్లూరు సీతారామారాజు భవనానికి రాధాకృష్ణ చేరుకున్నారు. అక్కడ కూడా ఆయనకు నిరసనలు ఎదురయ్యాయి. రాధాకృష్ణ గో బ్యాక్, గోబ్యాక్ అంటూ అల్లూరి సీతారామారాజు యువసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య రాధాకృష్ణను అక్కడి నుంచి తీసుకుని వెళ్లారు.
ఇదిలావుంటే, విప్లవ వీరుడు అల్లూరి సీతా రామరాజు జయంతి వేడుకలు విశాఖపట్నంలో బుధవారం ఘనంగా జరిగాయి. సీతమ్మధార జంక్షన్‌లోని అల్లూరి విగ్రహానికి అఖిల పక్షథ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడే ధర్నా చేశారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న అల్లూరి సీతా రామారాజుకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం లేదని వారు విమర్శించారు.
విశాఖపట్నం జిల్లాకు అల్లూరి జిల్లాగా నామకరణం చేయాలని వారు డిమాండ్ చేశారు. అల్లూరి సీతా రామారాజు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేశారు. మన్యం ప్రజలను కూడగట్టి ఆయన స్వాతంత్ర్య సమరం నడిపారు.












Click it and Unblock the Notifications