సివిసికి సిబిఐ జెడిపై వైయస్ విజయమ్మ ఫిర్యాదు

సిబిఐ మాన్యువల్‌కు విరుద్ధంగా తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసును విచారిస్తున్న అధికారులు వ్యవహరిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. జగన్‌పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న లక్ష్మినారాయణపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. విజయమ్మతో పాటు మేకపాటి రాజమోహన్ రెడ్డి, శోభా నాగిరెడ్డి, సుచిరత తదితరులు గంట పాటు సివిసితో మాట్లాడారు. సిబిఐ జెడిని పిలిచి విచారిస్తానని సివిసి హామీ ఇచ్చినట్లు శోభా నాగిరెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ఇదిలా వుంటే, లక్ష్మినారాయణ కాల్ డేటా రికార్డు వ్యవహారంపై సిఐడి దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంపై సిఐడి అధికారులు మహారాష్ట్రలోని నాందేడ్ ఎస్పీని ప్రశ్నించారు. లక్ష్మినారాయణ కాల్ డేటాను తన మిత్రుడి కోసం తెప్పించినట్లు ఎస్పీ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆ మిత్రుడి కోసం సిఐడి అధికారులు గాలిస్తున్నారు. లక్ష్మినారాయణ కాల్ లిస్టు కోసం సికింద్రాబాదులోని ఓ డిటెక్టివ్ ఏజెన్సీ ప్రతినిధులు నాందేడ్ ఎస్పీని కలిసినట్లు అనుమానిస్తున్నారు. ఈ డిటెక్టివ్ ఏజెన్సీ ప్రతినిధులను సిఐడి అధికారులు విచారించారు.
వైయస్ విజయమ్మ గత రెండు రోజులుగా రాజకీయ నాయకులను కలుస్తూ సిబిఐ జెడి లక్ష్మినారాయణపై ఫిర్యాదు చేశారు. ఆమె ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిసి కూడా ఫిర్యాదు చేశారు. జెడి (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్, ఎన్సీపి చీఫ్ శరద్ పవార్, సిపిఐ నేత ఎబి బర్దన్‌లను ఆమె కలిశారు.












Click it and Unblock the Notifications