వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు, బాలయ్యతో విభేదాల్లేవు: నాని జంప్‌పై జూనియర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jr Ntr
హైదరాబాద్: తన మామయ్య, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో, బాబాయి బాలకృష్ణతో, నాన్న హరికృష్ణతో తనకు ఎలాంటి విభేదాలు లేవని జూనియర్ ఎన్టీఆర్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని పార్టీ వీడటంపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నాని తనకు సన్నిహితుడే అని, అయినంత మాత్రం నాని పార్టీ మారడం వెనుక తన హస్తం ఉందని చెప్పడంలో అర్థం లేదన్నారు. తన కట్టె కాలే అంత వరకు తాను టిడిపితోనే ఉంటానని చెప్పారు. తనకు అందరూ కావాలన్నారు.

తాను కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నానని, కుటుంబంతో విభేదాలు ఉన్నాయని వచ్చే వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు. నానిని తాను వెనుక ఉండి నడిపించడం లేదన్నారు. నాని పార్టీ వీడటానికి ఆయన కారణాలు ఆయనకు ఉండవచ్చునని, దాంతో తనకు సంబంధం లేదన్నారు. ఎందుకు పార్టీ వీడాడనే విషయంపై ఆయననే అడగాలన్నారు. ఆయన పార్టీ వీడే ముందు తనను సంప్రదించలేదని చెప్పారు. తనకు గుడివాడపై ఉన్న అభిమానంతో మాత్రమే నానితో సన్నిహితంగా ఉన్నానని, నానిపై ప్రత్యేక అభిమానం లేదన్నారు.

తాను మాత్రం ప్రాణం పోయే వరకు టిడిపితోనే ఉంటానని చెప్పారు. తెలుగు జాతికి స్వర్గీయ నందమూరి తారక రామారావు చేసిన సేవను తాను గానీ, ఈ తెలుగు ప్రజలు గానీ ఎప్పుడూ మరిచిపోరాని అన్నారు. అలాంటి మహానుభావుడు స్థాపించిన పార్టీకి తాను దూరంగా ఉంటున్నానని వచ్చిన ఆరోపణలలో ఎలాంటి నిజం లేదన్నారు. తమ కుటుంబంలో కూడా ఎలాంటి మనస్పర్ధలు లేవని చెప్పారు. తనది రాజకీయాల్లోకి వచ్చే వయస్సు కాదని, అందుకే తాను ప్రస్తుతానికి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పారు.

టిడిపి బతికున్నంత కాలం తాను అదే పార్టీతోనే ఉంటానని చెప్పారు. టిడిపితో నాకు మనస్పర్థలు ఉన్నాయని నేను ఎప్పుడూ చెప్పలేదన్నారు. పార్టీకి అవసరమైనప్పుడు తన సేవలు ఖచ్చితంగా వినియోగిస్తానని చెప్పారు. టిడిపికి ప్రచారం చేయడం తన బాధ్యత అన్నారు. టిడిపి ఒక సిద్ధాంతం కోసం వచ్చిన పార్టీ అన్నారు. తాను పార్టీలో ఎలాంటి పదవి కోసం ఆరాట పడటం లేదని చెప్పారు. తాను ప్రస్తుతం సినిమాలలో ఉన్నానని, రాజకీయాల్లో తనకు అనుభవం లేదని, ఆ వయస్సు కూడా లేదని చెప్పారు.

తనపై మరోసారి ఎలాంటి అనుమానాలు లేకుండానే ఇప్పుడు వివరణ ఇస్తున్నానని చెప్పారు. ప్రతిసారి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాను కేవలం పార్టీని బలోపేతం చేయాలని మాత్రమే చెప్పానని, యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చానని, అంతేకానీ పార్టీకి లీడర్‌ను కావాలని అనుకోవడం లేదన్నారు. నాని పునరాలోచించుకోవాలని చెప్పారు. తాను టిడిపిలోనే ఉన్నానని... ఉంటానని చెప్పారు. పార్టీలో నాయకత్వ మార్పు ఒకరిద్దరు తీసుకునే నిర్ణయం కాదన్నారు. టిడిపి ఓ మహా సముద్రం వంటిదని, నేతలు సమష్టి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

English summary
Hero Junior NTR clarified that he is not having any differences with babai Balakrishna and uncle and TDP chief Nara Chandrababu Naidu. He responded on Gudiwada MLA Kodali Nani's party change on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X