వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ వెళ్లేందుకు విజయ సాయి రెడ్డికి గ్రీన్ సిగ్నల్, కానీ..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijaya Sai Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద బయట ఉన్న జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డికి ఢిల్లీ వెళ్లేందుకు సోమవారం అనుమతి లభించింది. సిబిఐ న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. సాయి రెడ్డి ఢిల్లీకి వెళ్లే రెండు రోజుల ముందు వెళుతున్నట్లు సిబిఐకి వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

ఈ నెల 20వ తారీఖు నుండి వచ్చే నెల 20వ తారీఖు మధ్య ఎప్పుడైనా ఢిల్లీ వెళ్లవచ్చునని తెలిపింది. అక్కడకు వెళ్లినప్పటికీ ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో సిబిఐకి ఫోన్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఎమ్మార్ కేసులో నిందితులు విజయ రాఘవ, కోనేరు ప్రసాద్, సునీల్ రెడ్డి, బిపి ఆచార్యలను కోర్టు సోమవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించింది. వారికి ఈ నెల 23వ తేది వరకు రిమాండ్ విధించింది.

మరోవైపు రంగారెడ్డి జిల్లాలో సాక్షి విలేకరి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. లీడ్ ఇండియా సంస్థ కార్యకర్త, ఐబిఎం ఉద్యోగిని వాసిరెడ్డి చంద్రబాల ఫోన్ కాల్ లిస్టు వ్యవహారంలో నమోదైన కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దిన పత్రిక విలేకరి యాదగిరి రెడ్డి ముందస్తు బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టును గత మంగళవారం ఆశ్రయించారు.

ఈ కేసులో యాదగిరి రెడ్డిని ప్రథమ నిందితుడిగా పేర్కొంటూ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ విలేకరి సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. ఫోన్ కాల్స్ లీకేజి వ్యవహారంతో పాటు, ఈ ఘటనపై సాక్షిలో ప్రసారమైన కథనంతో కూడా తనకు సంబంధం లేదని, కుట్ర పూరితంగానే తనపై కేసు మోపారని, ఎఫ్ఐఆర్‌లో పొందుపరిచిన నేరారోపణలన్నీ అవాస్తవాలని తన పిటిషన్‌లో పాత్రికేయుడు పేర్కొన్నారు.

తాను చట్టాన్ని గౌరవించే పౌరుడిని అని, నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి నివాసిని అని వివరిస్తూ... అజ్ఞాతంలోకి వెళ్లే ప్రశ్నే ఉత్పన్నం కాదని విన్నవించాడు. బెయిల్ మంజూరు చేస్తే దర్యాఫ్తు అధికారికి పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నాడు. కాగా ముందస్తు బెయిల్ నోటీసు అదనపు పిపి నాగరాజుకు ఇచ్చారు. సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కేసు తదుపరి విచారణను వాయిదా వేశారు. అనంతరం ఈ రోజు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేశారు.

English summary
Vijaya Sai Reddy, Jagathi Publications vice chairman get green signal to his Delhi tour by CBI special court on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X