డబ్బే పరమార్థమనుకుంటే జైలుకెళ్లారు: కిరణ్ హితవు

Kiran Kumar Reddy
చిత్తూరు: డబ్బు సంపాదనే పరామర్థమనుకుంటే జైలుకు వెళ్లిన వ్యక్తులు కూడా ఉన్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన చిత్తూరు జిల్లాలో విద్యాపక్ష వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో కిరణ్ మాట్లాడారు. డబ్బు కాంక్ష పెరిగిపోయి విలువలు లేకుండా ఉన్న వారు జైళ్లకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయన్నారు. కేవలం డబ్బుతోనే రాణిస్తామంటే కుదరదని చెప్పారు.

మనం ఈ ప్రపంచంలోనికి వట్టి చేతులతో వచ్చామని వట్టి చేతులతోనే వెళతామని హితబోధ చేసారు. జీవితం బాగా ఉండాలంటే, కుటుంబాన్ని సక్రమంగా పోషించాలంటే న్యాయపరంగా, చట్టపరంగా డబ్బు సంపాదించడం పిల్లలకు నేర్పాలన్నారు. పిల్లలకు విలువలు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైనే ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. విద్యార్థులు తాము అనుకున్న మార్గంలోనే నడవాలన్నారు.

ఇప్పటి నుండే ఓ లక్ష్యాన్ని చూడాలన్నారు. కష్టపడకుంటే ఫలితం రాదని, మనకంటే ఒకరు పైన ఉంటే చూసి ఈర్ష పడవద్దని, కష్టపడి వారి సాధించాలన్నారు. నాణ్యమైన విద్య, మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని చెప్పారు. పిల్లలు తల్లిదండ్రుల బలవంతంతో చదవద్దన్నారు. డ్రాపౌట్సును పాఠశాలలకు పంపించడమే ఈ విద్యా పక్షోత్సవాల లక్ష్యమన్నారు. చదువు పైన దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు.

క్రీడలు ఏకాగ్రతను పెంచి జీవితంలో గెలుపోటములు తట్టుకునే శక్తిని ఇస్తాయని చెప్పారు. ప్రతి పాఠశాలకు పిఈటిని నియమిస్తామని, అలాగే కంప్యూటర్ కూడా తప్పని సరి అని చెప్పారు. ఇల్లు, బడి విద్యార్థులకు విలువలను నేర్పించాలని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+