వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడాలి నాని జంప్: విజయమ్మతో భేటీ, టిడిపి వేటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodali Nani
కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని సోమవారం ఉదయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మతో సోమవారం ఉదయం భేటీ అయ్యారు. భేటీ విషయం తెలియగానే తెలుగుదేశం పార్టీ ఆయనపై వేటు వేసింది. పార్టీ నుండి నానిని సస్పెండ్ చేస్తూ ప్రకటన జారీ చేసింది. విజయమ్మతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడటానికి నాని నిరాకరించారు. విజయమ్మతో నాని భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. 2009 సాధారణ ఎన్నికలలో కొడాలి నాని గుడివాడ నుండి తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

కొడాలి నాని హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితుడు కావడం విశేషం. గత కొంతకాలంగా కొడాలి నాని వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళతారనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలకు ముందు విజయవాడ పట్టణ అధ్యక్షులు వల్లభనేని వంశీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని రహదారిపై కలవడం చర్చకు దారి తీసింది. అనంతరం ఆయన బాబుకు వివరణ ఇచ్చుకున్నారు.

వంశీకి సన్నిహితుడు అయిన నాని కూడా జగన్ వైపు వెళతారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన మంత్రి పార్థసారథితో భేటీ కావడంతో కాంగ్రెసు వైపు వెళ్లవచ్చుననే ఊహాగానాలు వినిపించాయి. ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు జగన్‌తో కలిసి ఉన్న నాని ఫ్లెక్సీలు విజయవాడలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో నాని జగన్ వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన హైదరాబాదులో బాబును కలిశారు. దీంతో నాని వెనక్కి తగ్గారని తెలుగు తమ్ముళ్లు భావించారు.

కానీ ఆ తర్వాత కూడా ఆయన జగన్ వైపు వెళతారనే ప్రచారం తగ్గలేదు. ఆయన ఏ క్షణంలోనైనా జగన్‌కు జై కొడతారని అనే వాదనలు వినిపించాయి. జైలులో ఉన్న జగన్‌ను కలిసిన తర్వాత నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే తేది ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు విజయమ్మతో భేటీ కావడంతో ఆయన టిడిపిని వీడటం ఖాయమని అంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు రెండుసార్లు ఆయనను బుజ్జగించినప్పటికీ ఫలితం లేకపోయింది. కాగా నాని సోమవారం జగన్‌ను కలిసే అవకాశముందని తెలుస్తోంది.

English summary
Telugudesam Party Gudiwada MLA and Hero junior NTR 
 
 close friend Kodali Nani met YSR Congress party 
 
 respectory chief and Pulivendula MLA YS Vijayamma on 
 
 Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X