ఇంటర్‌నెట్‌లో మహిళ మార్ఫ్‌డ్ ఫొటోలు, టెక్కీ అరెస్టు

వేధింపులు భరించలేక ఆమె ఉద్యోగం వదిలేసి, మరో సంస్థలో చేరింది. దాంతో వంశీ ఆగిపోలేదు. అతను కూడా ఆమె చేరిన సంస్థలోనే చేరి వేధించడం ప్రారంభించాడు. మహిళపై కక్ష పెంచుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆమె ఇమెయిల్‌ను హ్యాక్ చేశాడు.
ఆమె పేరు మీద ఓ ఇ- మెయిల్ ఐడి కూడా క్రియేట్ చేశాడు. ఈ మెయిల్ ద్వారా ఆమె బంధువులకు, మిత్రులకు అసభ్యకరమైన మెయిల్స్, మార్ఫ్‌డ్ ఫోటోలు పంపుతూ వస్తున్నాడు. ఆమె బాగా తెలిసి ఉండడంతో వంశీకి ఆమె సెక్యూరిటీ కోడ్‌ను ఛేదించి, ఇ - మెయిల్‌ను హ్యాక్ చేయడం సులభమైంది.
కర్నూలుకు చెందిన వంశీని సిఐడి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నేరం చేయడానికి వాడిన ల్యాప్‌టాప్‌ను, ఇంటర్నెట్ డేటా కార్డును, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications