లగడపాటిపై రాజయ్య, టిజి వెంకటేష్‌పై పొన్నం ఫైర్

Ponnam Prabhakar
వరంగల్/కరీంనగర్: తమ పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య మండిపడ్డారు. చికిత్స నిమిత్తం లగడపాటి రాజగోపాల్‌ను తక్షణమే ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించాలని ఆయన అన్నారు. సున్నితమైన తెలంగాణ అంశంపై లగడపాటి పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, లగడపాటిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

కాంగ్రెసు పార్టీ నిర్ణయంతో తెలంగాణ రాదని లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ అంశంతో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని లగడపాటి రాజగోపాల్ అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ తన వైఖరి ప్రకటించినా ఇతర పార్టీలు వైఖరి ప్రకటించనంత వరకు కేంద్రం ఏమీ చేయలేదని ఆయన అన్నారు.

పనిచేయని అధికారులను రోడ్డు మీద నిలబెట్టి కాల్చేయాలని మంత్రి టిజి వెంకటేష్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఐఎఎస్ అధికారులపై వెంకటేష్ వ్యాఖ్యలు సరి కాదని ఆయన అన్నారు. రాష్ట్ర స్థాయి మానసిక వైద్య నిపుణుల రెండు రోజుల సదస్సును ఆయన శనివారం కరీంనగర్‌లో ప్రారంభించారు.

కరీంనగర్ జిల్లా ప్రజలకు మంచినీరు అందించకుండా ఎల్లంపల్లి నుంచి హైదరాబాదుకు నీరు తరలిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. మంచినీటి కోసం తల్లడిల్లుతున్న జిల్లా ప్రజలకు సత్వరమే నీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే రాజకీయాలకు అతీతంగా నీటి తరలింపును అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+