వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాగర్ నీళ్లు వదలొద్దు: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: నాగార్జున సాగర్ నీటి విడుదలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సాగర్‌లో 510 ఫీట్‌లకు తక్కువగా నీరు ఉంటే కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయవద్దని ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, నీటి పారుదల శాఖకు కోర్టు నోటీసులు ఇచ్చింది. అనంతరం విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.

వెంకట్ రెడ్డి అనే చీఫ్ ఇంజనీర్ సాగర్ నీటి విడుదలపై హైకోర్టులో పిటిషన్ వేశారు. నాగార్జున సాగర్‌లో 510 అడుగులకు తక్కువగా ఉంటే నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేయవద్దని, నీటి మట్టం 525 అడుగులకు పైగా ఉంటే మాత్రమే విడుదల చేయవచ్చునని, ఇప్పుడు 510 మాత్రమే ఉందని కాబట్టి విడుదలను ఆపాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ స్వీకరించిన కోర్టు ఈ రోజు దానిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి ప్రభుత్వానికి, నీటి పారుదల శాఖకు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాల తర్వాత జరగనుంది. హైకోర్టు తీర్పుపై వెంకట్ రెడ్డి స్పందించారు. నాగార్జున సాగర్‌లో నీరు డెడ్ స్టోరేజ్‌లో ఉందని, ఇలాంటి పరిస్థితులలో నీటిని విడుదల చేస్తే ముందు ముందు తీవ్ర ఇబ్బందులు ఎదురువుతాయన్నారు.

ఇప్పటికే శ్రీశైలం నుండి నీటిని విడుదల చేశారని, ఇప్పుడు సాగర్ నీరు కూడా విడుదల చేయడం సరికాదన్నారు. 525 ఫీట్లు ఉంటేనే ఎడమ, కుడి కాలువల గుండా నీటిని విడుదల చేయవచ్చునని చెప్పారు. జూన్ ఫస్ట్ నాటికి గతంలో 510 కంటే కిందకు పోయిన రోజులు కూడా ఉన్నాయని అన్నారు. గతంలో 501, 502, 500 కంటే తక్కువగా వచ్చిన రోజులు కూడా ఉన్నాయని చెప్పారు.

English summary

 High Court of Andhra Pradesh issued interim orders on Nagarjuna Sagar water releas on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X