రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతుల్ని కోప్పడలేదు, నిధుల కోరత లేదు: కిరణ్‌కుమార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
కాకినాడ: ఇందిర బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడో రోజైన సోమవారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్‌లో ప్రభుత్వం పథకాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను ఆదివారం రైతులపై ఆగ్రహం వ్యక్తం చేయలేదని, ప్రభుత్వ వాదన కూడా వినాలని మాత్రమే సూచించానని చెప్పారు. మరింత మెరుగైన పాలన కోసమే ఇందిర బాట కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.

ప్రజల నుండి వచ్చిన సూచనలను పరిశీలిస్తామని అన్నారు. జిల్లాలో ఉన్న ఖాళీ పదవులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనేతరులకు ఏజెన్సీలలో ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఇందిర బాట కార్యక్రమంలో పాల్గొన్న తనకు తన బాల్యం గుర్తుకు వచ్చిందన్నారు. సంతోషంగా అనిపించిందన్నారు. యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని, ప్రభుత్వం కూడా వారికి అండగా ఉంటుందని చెప్పారు.

రాజీవ్ యువకిరణాలు పథకానికి ఎలాంటి నిధుల సమస్య లేదన్నారు. విద్యుత్ కొరత రాష్ట్ర సమస్య కాదని, జాతీయ సమస్య అన్నారు. వర్షాలు పడక పోవడంతో విద్యుదుత్పత్తికి ఆటంకం కలుగుతోందన్నారు. రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉందని, తీర్పు వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. కాకనాడ సెజ్ విషయంలో ప్రభుత్వం తటస్థంగా ఉందని చెప్పారు.

నిపుణుల బృందం వచ్చి పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాకు ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంచార్జిగా ఉంటారని చెప్పారు. ఆయన కాస్త అనారోగ్యం కారణంగా సమావేశానికి రాలేక పోయారన్నారు. కాగా ఈ రోజుతో ఇందిర బాట కార్యక్రమం పూర్తవుతుంది.

English summary
CM Kiran Kumar Reddy said that he is not angry at state farmers. He monitored government schemes on Monday at Kakinada collectorate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X