తెలంగాణ సమ్మె, లాయర్ల తీరుపై సుప్రీం ఆగ్రహం

Suprem Court
న్యూఢిల్లీ: నిరుడు తెలంగాణ సకల జనుల సమ్మె సందర్భంగా హైదరాబాదులోని రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదులపై ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేదని ఆరోపిస్తూ సకల జనుల సమ్మె సందర్భంగా న్యాయవాదులు వ్యవహరించిన తీరుపై కృష్ణయ్య అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంపై కూడా తీవ్రంగా మండిపడింది.

రాష్ట్రప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసింది. న్యాయమూర్తులు హెల్మెట్‌తో వచ్చి విధులు నిర్వహించాల్సిన పరిస్థితిని కల్పించిందని వ్యాఖ్యానించింది. గొడవలు చేసిన న్యాయవాదులను ఎందుకు గుర్తించలేదని, ఒకవేళ గుర్తిస్తే బార్ కౌన్సిల్ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించింది. చర్యలు తీసుకుంటే ఎంత మందిపై తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది. బార్ కౌన్సిల్‌పై ఏ విధమైన చర్యలు తీసుకున్నారో తెలపాలని కూడా ఆదేశించింది.

నిందితులపై చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టులోనూ ఇలాంటి పరిస్థితే తలెత్తే ప్రమాంద ఉందని వ్యాఖ్యానించింది. సరైన చర్యలు తీసుకోకపోవడం ద్వారా కోర్టుల్ోల రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని సమర్థిస్తున్నారా అని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పాటించకపోతే ఆ ప్రభుత్వాలను రద్దు చేస్తే మంచిదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గొడవలు చేసిన న్యాయవాదుల లైసెన్సులు ఎందుకు సస్పెండ్ చేయలేదని అడిగింది. గొడవలకు కారణమైన రాజకీయ పార్టీలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

హైకోర్టులో తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. వ్యవస్థలు పనిచేయకపోతే అవి ఉండి ఏం లాభమని, అటువంటి వాటిని రద్దు చేసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ సకల జనుల సమ్మె సందర్భంగా హైకోర్టులో తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. హైకోర్టులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+