తెలంగాణపై తేల్చాల్సిందే: మంత్రులతో ఎమ్మెల్యేలు

మంత్రులు తమను పట్టించుకోవడం లేదని శాసనసభ్యులు కమిటీకి ఫిర్యాదు చేశారు. మంత్రులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సందర్భాలున్నాయని వారన్నారు. నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు సూచించారు. ప్రభుత్వ పథకాల ప్రచారం బాగా లేదని వారు చెప్పారు. పలు సమస్యలను శాసనసభ్యులు మంత్రుల కమిటీ దృష్టికి తెచ్చారు.
పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని, కష్టపడి పార్టీ కోసం పనిచేసేవారికి నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలని వారు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ గురించి చర్చ జరిగింది. ఎస్సీలకు ఇచ్చిన ప్రాధాన్యం ఎస్టీలకు ఇవ్వడం లేదనే అభిప్రాయం కూడా సమావేశంలో వ్యక్తమైంది. మంత్రుల కమిటీ ప్రస్తుతం అభిప్రాయ సేకరణ జరుపుతోంది.
అభిప్రాయాలను సేకరించి, ఆ తర్వాత మంత్రుల కమిటీ సమీక్షిస్తుంది. ప్రభుత్వ పథకాలపై కూడా సమీక్ష చేస్తుంది. అన్నింటినీ కలిపి మంత్రుల కమిటీ ముఖ్యమంత్రికి ఓ నివేదిక సమర్పిస్తుంది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వడానికి మంత్రుల కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ మధ్య కమిటీ తరుచుగా సమావేశమవుతోంది.












Click it and Unblock the Notifications