రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢీకొని గోదావరిలో పడిన రెండు లారీలు, 5గురు మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Accident at Jonnada bridge
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలమూరు మండలం జొన్నడ వంతెన వద్ద ఎదురెదురుగా వస్తున్న ఇసుక లారీ, సిమెంట్ లారీ డీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. సిమెంట్ లారీ వేగంతో రావడమే కాకుండా, ఈ వంతెన వద్ద ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించే అవకాశం లేకపోవడం మరో కారణమని అంటున్నారు.

వంతెన ప్రమాదకరంగా ఉన్నప్పుడు లారీ వేగంగా రావడం వల్లే ఘోర ప్రమాదం జరిగిందంటున్నారు. ఢీకొన్న రెండు లారీలు వంతెన మీద నుండి గోదావరి నదిలో పడిపోయాయి. చనిపోయిన ఐదుగురిలో ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. ఎనిమిది మందిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. ఘటన జరగగానే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వెంటనే స్పందించారు. మృతులంతా విశాఖపట్నం జిల్లా పాడేరుకు చెందిన కూలీలుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు లారీలో 20 మంది కూలీలు ఉన్నారు. కాగా జొన్నాడ ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. గోదావరిలో పడిపోయిన లారీలను పోలీసు సిబ్బంది క్రేన్ సహాయంతో బయటకు తీసింది.

మరోవైపు హైదరాబాదులోని ఉందానగర్ రైల్వే స్టేషన్‌లో ఉదయం రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడమే మృతి చెందారు. వారు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది.

English summary
Five daily workers dead in an accident in East Godavari district. Clash took between two lorries at Jonnada bridge of East Godavari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X