హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉరేసి ఇద్దరు చిన్నారుల హత్య, దొంగతనం కోసమే

By Pratap
|
Google Oneindia TeluguNews

Two children strangled by unidentified persons
హైదరాబాద్: ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను గుర్తుతెలియని వ్యక్తులు చున్నీతో గొంతులకు ఉరి వేసి చంపారు. తుకారాంగేట్ పోలీసుస్టేషన్‌ సమీపంలోని అడ్డగుట్ట బీ సెక్షన్‌లో ఉంటున్న యాకుబ్‌పాషా, సమ్రీనా దంపతులకు సమ్రీన్ (4) మహేక్ (2) సంతానం. యాకుబ్‌పాషా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేస్తుంటాడు. మంగళవారం ఉదయం ఇతడు పనికి వెళ్లిపోయాడు. మంగళవారం మధ్నాహ్నం 3.30 సమయంలో సమ్రీనా ఇద్దరు కూతుళ్లను ఇంట్లో పడుకోబెట్టి పక్కింట్లో ఉంటున్న బంధువుల వద్దకు వెళ్లింది.

సాయంత్రం 6.30 సమయంలో ఆమె ఇంటికి వచ్చింది. తలుపు తీసి ఉండడంతో అనుమానమొచ్చి లోపలికి వెళ్లింది. కూతుళ్లు నేల మీద పడి ఉండడం, వారి గొంతుపై ఉరి బిగించిన ఆనవాళ్లు కనిపించడంతో ఆందోళన చెందింది. వెంటనే సమీపంలో ఉన్న రెండు, మూడు ఆస్పత్రులకు తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు పట్టించుకోకపోవడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే పిల్లలు మృతిచెందారని అక్కడి వైద్యులు ద్రువీకరించారు. తుకారాంగేట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుదర్శన్‌రెడ్డి, మహంకాళి ఏసీపీ వాసుసేన సంఘటన స్ధలాన్ని పరిశీలించారు. క్లూటీం ఆధారాలు సేకరించింది. చిన్నారుల మృతదేహాలను పోలీసులు గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుల తల్లిదండ్రులు, బంధువులు మార్చురీ వద్దకు వచ్చారు.

ఆర్ఆర్‌సీ మైదానానికి సమీపంలో యాకూబ్‌పాషా ఇల్లు ఉంటుంది. ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన వారు హత్యకు పాల్పడ్డారా, వారు ఆర్ఆర్‌సీ మైదానం వైపు నుంచి వచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లోని 9 తులాల బంగారు ఆభరణాలు కనిపించడం లేదని యాకుబ్‌పాషా తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీన్నిబట్టి దొంగతనం కోసమే పిల్లలను దుండగులు చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇటీవల జరిగిన శుభకార్యానికి ఇద్దరు పిల్లలకు సమ్రీనా నగలు పెట్టినట్టు తెలిసింది. చిన్నారుల్ని దొంగలే హత్య చేసి నగలు దోచుకెళ్లి ఉంటారని స్ధానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Two children were strangled by unidentified persons at their house in Addagutta on Tuesday while their mother was away. The victims, Samreen, 4, and Mehek, 2, were the daughters of garments vendor Yakub Pasha and his wife Shameena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X