హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి, జగన్ పార్టీ మధ్యే: కొడాలి నాని, రేవంత్ కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth Reddy - Kodali Nani
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేయడం తన బాధ్యత అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం తెలుగుదేశం పార్టీ గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని(కొడాలి వెంకటేశ్వర రావు) గురువారం అన్నారు. ఆయన రాష్ట్రపతి ఎన్నికలలో తన ఓటును వేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

తన ఆత్మ ప్రభోదానుసారం తాను ఓటు వేశానని చెప్పారు. ఓటు వేయడం తన బాధ్యత కాబట్టి వేశానన్నారు. కాగా పిటిషన్ల కమిటీ అధ్యక్షునిగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కను కలిసేందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మల్యేలు పయ్యావుల కేశవ్, రేవంత్ రెడ్డి వచ్చారు. అదే సమయంలో కొడాలి నాని కూడా వచ్చారు. ఈ సమయంలో నాని మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ ఫినిష్ అయినట్లేనని, వచ్చే ఎన్నికలలో పోటీ వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ మధ్యే ఉంటుందని చెప్పారు.

ఆయన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ పోటీలో ఎవరు గెలుస్తారు... ఏ పార్టీ ఫినిష్ అవుతుందనేది ఢిల్లీలో జరుగుతున్న దానిని బట్టి ఉంటుందని కామెంట్ చేశారు. ఈ రోజు పరిస్థితిని బట్టి రెండేళ్ల తర్వాత ఏం జరుగుతుందనే సంగతిని ఇప్పుడే చెప్పలేమని అన్నారు.

కాగా రాష్ట్రపతి ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ.. కొడాలి నాని, చిన్నం రామకోటయ్య, వేణుగోపాల చారి, హరీశ్వర్ రెడ్డి, జగన్ వర్గం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డిలు తమ ఓటును వేశారు. పార్టీలో చర్చించి వారిపై వేటు విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

English summary
Krishna district Gudiwada Jagan camp TDP MLA Kodali Nani said that he was cast his vote as per conscience. He said he feel it's his duty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X