వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌, బొత్సలకు ఊరట: మార్పులేదన్న కృష్ణమూర్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

KB Krishnamurthy
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఊరట లభించింది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డిని తొలగించడం గానీ పి.సి.సి. అధ్యక్షునిగా బొత్సను మార్చడం గానీ జరగదని, నాయకత్వ మార్పు అధిష్టానం పరిశీలనలో లేదని ఎఐసిసి పరిశీలకుడు కెబి కృష్ణమూర్తి శుక్రవారంనాడు స్పష్టం చేశారు.

అయితే త్వరలో రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రక్షాళన జరుగుతుందని మాత్రం ఆయన వెల్లడించారు. త్వరలోనే పిసిసి కార్యదర్శులను నియమిస్తారని, అలాగే కార్యకర్తలతో పార్టీ నాయకులు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తారనీ ఆయన వెల్లడించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మార్పులూ చేర్పులూ ఉండవచ్చునని ఆయన అన్నారు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఉంటుందని ఆయన చెప్పారు.

బెయిలు సంపాదించడానికే వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్రపతి ఎన్నికలో ప్రణబ్ ముఖర్జీకి ఓట్లు వేసిందన్న ఆరోపణలలో నిజం లేదని ఆయన వివరించారు. ఇకపోతే తెలంగాణ చాలా ముఖ్యమైన అంశమని, అయితే అది తన పరిధిలో లేదని ఆయన వివరించారు. బెయిల్ కోసమే ప్రణబ్ ముఖర్జీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రణబ్ ముఖర్జీకి ఓటేసిందని తెలుగుదేశం పార్టీతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా విమర్శిస్తోంది.

ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెడుతుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్పించవచ్చుననే ఊహాగానాలు కూడా చెలరేగాయి. కృష్ణమూర్తి ప్రకటనతో ఆ ప్రచారానికి తెర పడుతుందని భావించవచ్చు.

English summary
CM Kiran Kumar Reddy and PCC president Botsa Satyanarayana got relief with the statement made by AICC observer KB Krishnamurthy. He said that there will be no leadership change in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X