హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరులాగే సోనియాకు తాకట్టు: జగన్‌పై రేవంత్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: కడప పౌరుషాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైయస్ జగన్‌పై, వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. ఢిల్లీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పిన జగన్ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి ఎలా ఓటేశారని ఆయన అడిగారు. బెయిల్ కోసమే జగన్ ప్రణబ్ ముఖర్జీకి ఓటేశారని ఆయన ఆరోపిచారు.

ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి రాయచోటికి చెందిన కృష్ణయ్య దగ్గర కొనుక్కుని మల్టీ నేషనల్ కంపెనీ కాంగ్రెసుకు అమ్ముకున్నారని, అలాగే నల్లగొండ జిల్లాకు చెందిన శివకుమార్ వద్ద కొనుక్కున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వైయస్ జగన్ కాంగ్రెసుకు అమ్ముకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. మడప తిప్పని వంశమని చెప్పిన జగన్ కాంగ్రెసుకు అమ్ముడుపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీతో కాంగ్రెసు కుమ్మక్కయి తనపై సిబిఐ చేత వేధింపులకు గురి చేస్తోందని, కుట్రలు చేస్తోందని జగన్ ఆరోపించారని, ఇప్పుడు జగన్ పార్టీ నాయకులు మాట మార్చి న్యాయస్థానాలు వేరు, ప్రభుత్వాలు వేరు, కాంగ్రెసు పార్టీ వేరని మాట్లాడుతున్నారని, కాంగ్రెసు పార్టీతో చేసుకున్న రహస్య ఒప్పందం కారణంగానే వారు మాట మారుస్తున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆ రోజు చెప్పిందైనా అబద్దం కావాలి, ఈ రోజు చెప్పేదైనా అబద్ధం కావాలని ఆయన అన్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వాడుకున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు జగన్‌ జైలు నుంచి బయటకు రావడానికి కుట్ర జరుగుతోందని, రెండు నెలలు జైలులో ఉండగానే జగన్‌కు సోనియమ్మ దయ కావాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ప్రధాని సమక్షంలో వైయస్ విజయమ్మ రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్ కుటుంబం పెట్టుబడి నమ్మకద్రోహమని, దోచుకోవడం ఆ కుటుంబం వ్యాపారమని ఆయన వ్యాఖ్యానించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసులో కలిసిపోతుందని, లేదంటే కనుమరగై పోతుందని ఆయన అన్నారు. తల్లి విజయమ్మ, చెల్లె షర్మిల కన్నీళ్లను జగన్ రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని ఆయన అన్నారు. జగన్ నటనలను, జగన్ నైజాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన అన్నారు. ప్రజల భావోద్వేగాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సొమ్ము చేసుకుందని, అది నయవంచుకల పార్టీ అని ఆయన అన్నారు.

English summary
Telugudesam MLA Revanth Reddy has lashed out at YSR Congress president YS Jagan. He alleged YS Jagan has made secret understanding with Congress to come out of jail on bail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X