హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి ఎమ్మెల్సీ నర్సారెడ్డికి హైకోర్టు తీర్పు షాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: తెలుగుదేశం నిజామాబాద్ ఎమ్మెల్సీ నర్సారెడ్డికి హైకోర్టు తీర్పు షాక్ ఇచ్చింది. నర్సారెడ్డి ఎన్నికల చెల్లదంటూ హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. నర్సారెడ్డిపై కాంగ్రెసు అభ్యర్థి వెంకట్రామి రెడ్డి 9 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు హైకోర్టు వెల్లడించింది. నర్సారెడ్డి ఎన్నికల చెల్లదంటూ వెంకట్రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఓట్ల లెక్కింపు జరిపి నర్సారెడ్డి ఎన్నిక చెల్లదని ప్రకటించింది.

తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు నర్సా రెడ్డికి గతంలో సుప్రీం కోర్టులోనూ చుక్కెదురయింది. కాంగ్రెసు అభ్యర్థి వెంకట్రామి రెడ్డి గెలిచినట్లు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నిలిపి వేయాలని కోరుతూ ఆయన సుప్రీం కోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌(ఎస్‌ఎల్‌పి)ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ విషయంపై స్థానిక కోర్టులోనే తేల్చుకోవాలని నర్సా రెడ్డికి కోర్టు సూచించింది.

గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నర్సా రెడ్డికి చుక్కెదురైంది. నిజామాబాద్ స్థానిక సంస్థల ప్రతినిధుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా కాంగ్రెసు అభ్యర్థి వెంకట్రామి రెడ్డిపై తెలుగుదేశం అభ్యర్థి నర్సారెడ్డి గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అయితే ఆ తర్వాత నర్సా రెడ్డి రెండు ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు హైకోర్టు ప్రకటించింది. దీనిపైనే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు.

దీనిపైనే నర్సా రెడ్డి మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. అక్కడా అయనకు చుక్కెదురైంది. అయితే తాను హైకోర్టులోనే తేల్చుకుంటానని ఆయన చెబుతున్నారు. కాగా నర్సా రెడ్డికి చుక్కెదురు కావడం ఆయనకు వ్యక్తిగతంగానే కాకుండా పార్టీకి కూడా ఎదురు దెబ్బనే. 2007లో ఎమ్మెల్సీగా నర్సారెడ్డి 7 ఓట్లతో గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

English summary

 High Court friday delivered its verdict on Telugudesam Nizamambad MLC Narsa Reddy. It announced that Narsa Reddy election is not valid and Congress candidate Venkatrami Reddy has won the election with a margin of 9 votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X