బెయిల్ డీల్: 20 కాదు 100 కోట్లకు సిద్ధపడ్డ 'గాలి'

గాలి బెయిల్ డీల్ కోసం ఆయనకు సంబంధించిన వారు రూ.100 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడ్డారని ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. గాలి బంధువు దశరథ రామి రెడ్డి తనకు వంద కోట్లు ఆఫర్ చేశారని, దాంతో తాను బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశానని చెప్పారు. నాటి సిబిఐ జడ్జి నాగమారుతి శర్మతో బెయిల్ పైన చర్చించానని, అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారని పేర్కొన్నారు.
ఆ తర్వాత రంగంలోకి రావి సూర్య ప్రకాశ్ రావు దిగారని, నాగమారుతి బదలీ కావడంతో పట్టాభి రామారావు వచ్చారని, ఆయనతో తాను రూ.15 కోట్లకు డీల్ కుదుర్చుకున్నానని చెప్పారు. అయితే తాను చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, పట్టాభి మరొకరితో డీల్ కుదుర్చుకొని బెయిల్ ఇచ్చారని చెప్పారు. ఈ నెల 11వ తేదిన ఎసిబి అధికారులు హైదర్‌గూడలోని లక్ష్మీ నరసింహ రావు ఇంట్లోనే ఆయన నుండి వాంగ్మూలాన్ని తీసుకున్నారు.
అదే సమయంలో గాలి బెయిల్ డీల్‌కు సంబంధించి ఆయన పేరు రావడంతో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో రూ.72 లక్షల చెక్కులు దొరికాయి. వాటితో పాటు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా గాలి బెయిల్ కేసులో ఇప్పటికే పలువురు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తి అరెస్టయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications