వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవార్ కోసం దిగొచ్చిన ప్రధాని, ప్రశంసల జల్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: ఎన్సీపి వల్ల తలెత్తిన సంక్షోభానికి తెర దించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ దిగొచ్చారు. ఎన్సీపి అధినేత శరద్ పవార్‌ను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. శరద్ పవార్ తమకు అత్యంత విలువైన సహచరుడని ఆయన అన్నారు. శరద్ పవార్ తమకు అత్యంత విలువైన సహచరుడని, శరద్ పవార్ విజ్ఝానం, తెలివితేటలు, అనుభవం తమ ప్రభుత్వానికి అత్యంత విలువైనవని, యుపిఎ సంకీర్ణంలో ఎన్సీపి తమకు ముఖ్యమైన భాగస్వామ్య పక్షమని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆయన శరద్ పవార్‌తో మాట్లాడారు.

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో శరద్ పవార్ మాట్లాడిన తర్వాత మన్మోహన్ సింగ్ ఆ వ్యాఖ్యలు చేశారు. యుపిఎ, ప్రభుత్వ పనితీరు పట్ల తమకు కొన్ని సమస్యలున్నాయని ఎన్సీపి నేత ప్రఫుల్ పటేల్ శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సమస్యలపై శరద్ పవార్ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఓ లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.

వచ్చే ఎన్నికలకు సిద్ధం కావడానికి ప్రభుత్వం మరింత నిర్ణయాత్మకంగా, సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలని తమ పార్టీ భావిస్తోందని ఆయన అన్నారు. నెంబర్ 2 స్థానం కోసం తమ నేత శరద్ పవార్ అలిగారంటూ వచ్చిన వార్తలపై ఆయన మండిపడ్డారు. శరద్ పవార్‌కు స్థానాల విషయం చాలా చిన్నదని ఆయన అన్నారు. మీడియాను కాంగ్రెసు నాయకులు కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

కుర్చీ కోసం పట్టుబట్టే తక్కువ స్థాయి నాయకుడు శరద్ పవార్ కారని ఆయన అన్నారు. శరద్ పవార్ సోనియాతో చర్చలు జరిపిన తర్వాత ప్రఫుల్ పటేల్ మీడియాతో మాట్లాడారు. యుపిఎలో కొనసాగుతామంటూనే ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పరిస్థితిపై చర్చించేందుకు ఎన్సీపి మరోసారి శుక్రవారం సాయంత్రం సమావేశమవుతోంది.

English summary
In a bid to resolve the stand-off between the Nationalist Congress Party and the Congress, Prime Minister Dr Manmohan Singh on Friday reached out to the Maratha leader Sharad Pawar and hailed him as a very valued colleague.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X