హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫైన్ చెల్లించలేదని మంత్రికి నాన్ బెయిలబుల్ వారెంట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Parthasarathi
హైదరాబాద్: మంత్రి పార్థసారథికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. పెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఆర్థిక నేరాల కోర్టు సోమవారం మంత్రికి దీనిని జారీ చేసింది. పేరా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఈడి గతంలో పార్థసారథికి మూడు లక్షల రూపాయల జరిమానా విధించింది. దానిని మంత్రి చెల్లించలేదు. అంతేకాకుండా పలుమార్లు కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ హాజరు కాలేదు. విచారణకు సహకరించలేదు.

దీంతో ఈడి ఆర్థిక నేరాల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడి పిటిషన్ స్వీకరించిన కోర్టు మంత్రికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పార్థసారథి 1994లో కెపిఆర్ టెలి ప్రోడక్ట్స్ పేరుతో ఓ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ కోసం రూ.60 లక్షల మిషనరీని కొనుగోలు చేశారు. ఈ కొనుగోలులో ఆయన పెరా నిబంధనలు ఉల్లంఘించారని అభియోగాలు ఉన్నాయి. ఆ కంపెనీ ఎండిగా ఆయనపై ఈడి ఆయనపై కేసు పెట్టింది. రూ.3 లక్షల జరిమానా విధించింది.

ఈ కేసు 2002 నుండి కేసు కొనసాగుతోంది. మంత్రి పార్థసారథి అప్పటి నుండి ఇప్పటి వరకు జరిమానా కట్టక పోగా ఇంత వరకు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఈడి కోర్టును ఆశ్రయించింది. ఆర్థిక నేరాల కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

కాగా నాన్ బెయిలబుల్ వారెంట్ అంశంపై మంత్రి స్పందిస్తూ... సమాచారలోపం వల్లే తాను కోర్టుకు హాజరు కాలేదన్నారు. తదుపరి విచారణకు తప్పకుండా హాజరవుతానని చెప్పారు.

English summary
Financial crime court issued Non-bailable warrant to minister Parthasarathi on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X