హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఇష్యూ: రేపు ఢిల్లీకి గవర్నర్, ముఖ్యమంత్రి

By Pratap
|
Google Oneindia TeluguNews

Narasimhan
హైదరాబాద్: తెలంగాణ అంశాన్ని తేల్చడానికే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, గవర్నర్ నరసింహన్‌ను ఢిల్లీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణ సమస్యపై పార్టీ అధిష్టానం దృష్టి పెడుతుందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు చెబుతుండగా, సెప్టెంబర్ లోగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కొద్ది కాలంగా చెబుతున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలు ముగిసి యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈలోగానే తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. ఇందులో భాగంగానే నరసింహన్, కిరణ్ కుమార్ రెడ్డిలతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.

నరసింహన్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం తదితర కేంద్ర మంత్రులను కలిసి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీ వెళ్లారు. తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఉంటే నష్టమేమిటని ఆయన తన ఢిల్లీ పర్యటనలో అన్నారు. బొత్స ప్రకటనపై సీమాంధ్ర నాయకులు మండిపడుతున్నారు. ఉన్నతమైన పదవిలో ఉండి బొత్స సత్యనారాయణ అటువంటి ప్రకటన ఎలా చేస్తారని సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు గాదె వెంకటరెడ్డి సోమవారం అన్నారు.

బొత్స సత్యనారాయణ ప్రకటన సరైంది కాదని, అది బొత్స సత్యనారాయణ వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణ తెలంగాణకు అనుకూలంగా పరోక్షంగా వ్యాఖ్య చేయడం పార్టీ అధిష్టానం సంకేతాలను అందించడమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెసు అధిష్టానం పార్టీ పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలను తీసుకుంది.

English summary
It is said that as a part of resolving Telangana issue, Congress high command has invited governor Narasimhan and CM Kiran kumar Reddy to Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X