కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయమ్మ కాన్వాయ్‌పై గుడ్లు,రాళ్ల దాడి: దీక్ష ఆలస్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
కరీంనగర్: సిరిసిల్లలో చేనేత దీక్షకు బయలుదేరిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మకు సోమవారం అడుగడుగునా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల నుండి అడ్డంకులు ఎదురయ్యాయి. కరీంనగర్ వరకు పలుచోట్ల తెరాస కార్యకర్తలు, టిఆర్ఎస్వీ నాయకులు ఆమె కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. కరీంనగర్ దాటాక సిరిసిల్లకు వెళ్లే మార్గంలో విజయమ్మకు మరింత ఎక్కువ అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో ఆ రహదారు రణరంగంగా మారింది.

సిద్దిపేట శివారు ఏరియా దాటాక ఎల్లమ్మ దేవాలయం సమీపంలో భారీగా తెరాస కార్యకర్తలు రోడ్డు పైకి వచ్చి విజయమ్మ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో వాహన శ్రేణి కాసేపు నిలిచిపోయింది. పోలీసులు కలుగజేసుకొని కార్యకర్తలను అక్కడి నుండి పంపించారు. ఆ తర్వాత మరో గ్రామంలోనూ విజయమ్మను అడ్డుకున్నారు. కార్యకర్తలు పొల్లాల్లోంచి రావడంతో పోలీసులు గుర్తించలేక పోయారు.

దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీఛార్జ్ కూడా చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. విజయమ్మ కాన్వాయ్‌ను అడుగడుగునా అడ్డుకోవడంతో సిరిసిల్లలో దీక్ష మరింత ఆలస్యమైంది. హైదరాబాదు నుండి కరీంనగర్ వెళ్లే వరకు ఓ రకంగా అడ్డంకులు ఎదురైతే ఆ తర్వాత అడ్డంకులు మరింత తీవ్రమయ్యాయి. చిన్నకోడూరు మండలం జక్కాపూరు గ్రామంలో తెరాస కార్యకర్తలు విజయమ్మ కాన్వాయ్ పైన రాళ్లు, చెప్పులతో దాడి చేశారు.

ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు వారిని చెదర గొట్టారు. పలు చోట్ల రోడ్లపై రాళ్లు అడ్డంగా పెట్టి అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. టైర్లు కాల్చి అడ్డంగా వేశారు. అల్వాల్, బొల్లారం, తూంకుంట, ప్రజ్ఞాపూర్, దుద్దెడ, సిద్దిపేట, జక్కాపూర్ తదితర గ్రామాలలో తెరాస అడ్డుకుంది. చంద్రంపేట దగ్గర రాస్తా రోకో నిర్వహించిన వినయ భాస్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అతను రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

సిఎంను కలిసిన తెరాస ఎమ్మెల్యేలు
తెలంగాణ భవన్‌లోకి ప్రవేశించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతు తెరాస ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.

కాగా మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో విజయమ్మ సిరిసిల్ల దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. దీక్షా ప్రాంగణంపై తెలంగాణవాదులు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురు మహిళలై సభా వేదిక ముందు జై తెలంగాణ నినాదాలు చేస్తూ సభను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. వారిని పోలీసులు అదుపు చేశారు.

English summary
Telangana Rastra Samithi activists obstructed YSR Congress party honorory president and Pulivendula MLA YS Vijayamma canvey at Hyderabad on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X