పెరుగుతున్న దూరం: అగాథా సంగ్మా రాజీనామా?

ఇదిలావుంటే, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రులకు ఇచ్చే విందుకు పవార్ హాజరు కాకపోవచ్చునని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి తప్పుకుని యుపిఎకు బయటి నుంచి మద్దతు ఇస్తామని ఆయన చెబుతున్నారు. భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి పవార్ సోమవారం పార్టీ సీనియర్ నేతలతో సమావేశమవుతున్నారు.
ఢిల్లీలోని మార్పులతో మహారాష్ట్రలోని భాగస్వామ్యం దెబ్బ తినదని శరద్ పవార్ కాంగ్రెసు నాయకులతో చెప్పినట్లు సమాచారం. అన్ని సమస్యలను పరిష్కరించడానికి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తామని కాంగ్రెసు ఎన్సీపి నాయకులతో చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో ఎన్సీపి సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో సమన్వయ కమిటీ లేదని మంత్రులు చెబుతున్నారని, ఇంతకు ముందు కమిటీ ఉండేదని, అయితే అది సమావేశం కాలేదని ఎన్సీపి నేత ప్రఫుల్ పటేల్ అన్నారు.
ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌పై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు ఎన్సీపిని పునరాలోచనలో పడేసినట్లు చెబుతున్నారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ భవన్ కాంట్రాక్టు విషయంలో చవాన్ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. నీటి పారుదలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎన్సీపి చేస్తున్న డిమాండ్ కూడా ముఖ్యమంత్రిని ఇరకాటంలో పడేశాయి.


Click it and Unblock the Notifications