హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సచివాలయ ముట్టడి: నారాయణ, రాఘవులు అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

BV Raghavulu-Narayana
హైదరాబాద్: విద్యుత్ సర్‌చార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాల సచివాలయ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. వాపమక్ష పార్టీల కార్యకర్తలు, నేతలు వివిధ మార్గాల ద్వారా సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని ఎక్కడికి అక్కడ అడ్డుకున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, మాజీ ఎంపీ మధు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు సహా పలువురుని పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణ, మధులను లుంబిని పార్క్ వద్ద అడ్డుకొని బొల్లారం పోలీసు స్టేషన్‌కు, లిబర్టీ మీదుగా సెక్రటేరియట్ వైపు వస్తున్న రాఘవులును అడ్డుకుని అబిడ్స్ స్టేషన్‌కు తరలించారు.

అంతకు ముందు లుంబినీ పార్క్ మీదుగా పెద్ద ఎత్తున వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులుతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాగైనా సచివాలయాన్ని ముట్టడించాలని వ్యూహాత్మకంగా వ్యవహరించిన పలువురిని పోలీసులు ఎక్కడకికి అక్కడ అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా నారాయణ, రాఘవులులు మాట్లాడుతూ.. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా ప్రతిష్టకు పోతోందని మండిపడ్డారు. ఇంధన ఛార్జీలు ఉపసంహరించుకునే వరకు వామపక్షాలు తమ పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదన్నారు. అంతకుముందు సిపిఐ నారాయణ పాదయాత్రతో సిపిఐ కార్యాలయానికి చేరుకున్నారు. అటు నుండి సచివాలయం ముట్టడికి బయలుదేరారు.

మరోవైపు వామపక్షాల ముట్టడి నేపథ్యంలో పోలీసులు సచివాలయం చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో మూడు కంపెనీల బలగాలను మోహరించారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం ఎనిమిది గంటల నుండే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు.

English summary
Communist parties secretariate muttadi created very tension in Hyderabad on Wednesday. Narayana and Raghavulu arrested by police and sent to police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X