వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోషినైతే ఉరి తీయండి: గోద్రా అల్లర్లపై నరేంద్ర మోడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Narendra Modi
అహ్మదాబాద్: గోద్రా అల్లర్లలో తాను దోషిగా తేలితే తనను ఉరి తీయండని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఓ ప్రముఖ ఉర్దూ వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విధంగా అన్నారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు సాహిద్ సిద్దిఖీ పత్రిక కోసం నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేశారు. నిర్మాత మహేష్ భట్, స్క్రిప్టు రైటర్ సలీం ఖాన్‌లతో ముంబైలో ఈ మధ్యాహ్నం భోజన సమయంలో కలిసినప్పుడు నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేయాలనే ఆలోచన తనకు తట్టిందని సిద్దిఖి చెప్పారు.

మిత్రులమంతా గుజరాత్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సలీం, భట్ ఏ సమస్యకైనా చర్చలు ముఖ్యమని అన్నారని, మోడీ ఇంటర్వ్యూకు అంగీకరిస్తారని తాను అనుకోలేదని నయీ దునియా సంపాదకుడు సిద్దిఖి అన్నారు. మోడీ ఇంటర్వ్యూతో తమ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌కు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

తమ ఇంటర్వ్యూతో ఎస్పీకి గానీ నేతాజీకి (ములాయం‌కు) గానీ ఏ విధమైన సంబంధం లేదని, తాను మొదట జర్నలిస్టునని, ఆ తర్వాత పార్టీ సభ్యుడినని ఆయన అన్నారు. సాహిద్ జర్నలిస్టుగా తన విధి నిర్వహించారని, దాన్ని పిఆర్ వ్యవహారంగా చూడడం దురదృష్టకరమని భట్ అన్నారు.

గుజరాతీ వ్యాపారవేత్త జాఫర్ సరేష్‌వాలా నివాసంలో సిద్ధిఖితో చర్చలు జరిగినట్లు మహేష్ భట్ ధృవీకరించారు. గోద్రా అల్లర్ల అనంతర పరిస్థితిపై కూడా మోడీ సిద్ధిఖి ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఉర్దూ పత్రికకు మోడీ ఇంటర్వ్యూ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

English summary
Gujarat Chief Minister Narendra Modi shocked all with his interview with an Urdu Newspaper discussing Godhra and post riots condition in the state. Everyone must be shocked as Modi discussed the issue during an interview and a stunning statement from the CM was the mother of all shockers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X