Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మనలాగే ఎంజాయ్ చేసేలా చూడాలి: మంచు మనోజ్

Manchu Manoj
హైదరాబాద్: ప్రకృతిని కాలుష్యం నుండి రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రముఖ హీరో మంచు మనోజ్ ఆదివారం అన్నారు. హుస్సేన్ సాగర్‌లో వ్యర్థ పదార్థాలు వేయకుండా కాపాడుకోవాలని ఇండియన్ ఆర్మీ, 92.7 బిగ్ ఎఫ్ఎం ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్, లక్ష్మీ ప్రసన్న, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడారు.

ఇలాంటి కార్యక్రమానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ప్రకృతిని కలుషితం చేయకుండా ఉండటం అందరి బాధ్యత అన్నారు. హుస్సేన్ సాగర్‌ను కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టం బాగుందన్నారు. సాగర్‌ను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పాత తరాలు మనకు అందించిన వాటిని ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నామని, భవిష్యత్తు తరాలు కూడా ఇలాగే ఎంజాయ్ చేయాలంటే కాలుష్యం నివారించాలన్నారు. సాగర్‌లో చెత్త, ప్లాస్టిక్ వేయకూడదని సూచించారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... సరస్సును కాపాడుకోవాలని, దానిని క్లీన్‌గా ఉంచేలా చూడాలన్నారు. చట్టాలను పూర్తిగా ప్రభుత్వంచే అమలు చేయించే బాధ్యత యువతపై ఉందన్నారు. ప్రతి పౌరుడు రాబోయే తరాలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం అందరి బాధ్యత అన్నారు. సరస్సును కాపాడుకోవాలని, దానిని గ్రీన్‌గా, క్లీన్‌గా ఉంచాలని, అలా ఉంటేనే మనమూ బాగుంటామన్నారు. ప్లాస్టిక్ వాడకలను నిరోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

కాగా నెక్లస్ రోడ్డు నుండి సెయిలింగ్ క్లబ్ వరకు ప్రదర్శన కొనసాగింది. వాక్‌ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+