నివేదికలు నా పని కాదు: తెలంగాణపై చిదంబరం

P Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణపై నూతన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదిక సమర్పించినట్లు వచ్చిన వార్తలను కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఖండించారు. తాము రాష్ట్రపతి తెలంగాణపై నివేదిక ఇవ్వలేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణపై రాష్ట్రపతికి నివేదికలు ఇవ్వడం తన పని కాదని ఆయన అన్నారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

తెలంగాణపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేకించి నిర్ణయం తీసుకునేది ఏదీ ఉండదని, అంతిమంగా కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. హోం మంత్రిత్వ శాఖ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసే సంస్థ మాత్రమేనని ఆయన అన్నారు. రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించే బాధ్యతను తామే తీసుకుంటామని, వారి అభిప్రాయం ఏదైనా అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర మంత్రివర్గమేనని ఆయన అన్నారు.

రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అభిప్రాయాలు చెప్తేనే తెలంగాణపై నిర్ణయం ఉంటుందని ఆయన అంటూ వచ్చారు. తెలంగాణపై ఏకాభిప్రాయం వస్తేనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మొదటి నుంచి చిదంబరం ఈ మాటే చెబుతున్నారు. తెలంగాణపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తే అఖిలపక్ష సమాువేశం ఏర్పాటు చేస్తామని ఆయన పలు మార్లు అన్నారు. తెలంగాణపై రాజకీయ పార్టీలు వైఖరి ప్రకటిస్తేనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని చెబుతూ వస్తున్నారు.

రాష్ట్రానికి చెందిన నాలుగు రాజకీయ పార్టీలు తెలంగాణపై తమ వైఖరిని వెల్లడించాల్సి ఉందని ఆయన చెబుతున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, మజ్లీస్ పార్టీలు తమ వైఖరులను ప్రకటించాల్సి ఉందని చెబుతున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్ర హోం శాఖ రాష్ట్రపతికి నివేదిక సమర్పించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై అందులో సానుకూలత వ్యక్తం చేయలేదని, భౌగోళిక, ప్రాదేశిక కారణాల వల్ల తెలంగాణ ఏర్పాటు సాధ్యపడక పోవచ్చునని హోం శాఖ రాష్ట్రపతికి సమర్పించిన నోట్‌లో పేర్కొంటున్నట్లు వార్తలు వచ్చాయి. శ్రీకృష్ణ కమిటీ క్రోడీకరించిన అంశాలను ప్రస్తావిస్తున్నట్లు తెలిపాయి. ఇక, తెలంగాణలో ప్రజలు ప్రస్తావిస్తున్న సమస్యలకు చట్టపరమైన పరిష్కారాలు, భద్రతలు, ఆర్థిక, సామాజిక రక్షణలు, అధికారాలను కల్పించడం సరైనదిగా ఉంటుందని, రాబోయే రెండేళ్లలో ఈ మేరకు తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నది కేంద్రం అభిప్రాయమని సూచించినట్లు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+