హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిక్కుల్లో పార్థసారథి, కేసు నమోదుకు ఈసికి ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Parthasarathi
హైదరాబాద్: మంత్రి పార్ధసారథి మళ్లీ చిక్కుల్లో పడ్డారు. ఫెరా నిబంధన ఉల్లంఘన కేసులో ఇప్పటికే జైలు శిక్ష పడి, బెయిలు మీద ఉన్న పార్ధసారథి తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆ కేసు వివరాలు పేర్కొనకపోవడంతో ఇబ్బందుల్లో పడ్డారు. ఈ కారణంగా ఆయనపై కేసు నమోదు చేయాలని మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ రాష్ట్ర ఎన్ని కల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై స్పంది చిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ - మంత్రి పార్ధసారథిపై కేసు నమోదు చేయాలని కృషా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారన్న శర్మ ఫిర్యాదుపై ఎన్నికల ప్రధానాధికారి స్పందించడంతో పార్ధ సారథి రాజకీయంగా కష్టాల్లో కూరుకుపోయి నట్టయింది.

ఫెరా ఉల్లంఘన కేసులో పార్థసారథి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. దానిపై రాష్ట్ర పార్టీ ఇన్చార్జి గులాంనబీ ఆజాద్‌ కూడా ఆరా తీశారు. పార్ధసారథి ఢిల్లీకి వెళ్లి తన వివరణ కూడా ఇచ్చుకున్నారు. మరో వైపు సారథికి విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌తో పాటు, జిల్లా ఎమ్మెల్యేలు కూడా అండగా నిలిచారు. అటు ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రికి బాసటగా నిలిచారు. ఈ సమయంలో సారథిని తొలగిస్తే బీసీల్లో తప్పుడు సంకేతాలు వెళతా యని, ఇప్పటికే బీసీకి చెందిన మోపిదేవి వెంకటరమణను సీబీఐ అరెస్టు చేసిందని, మళ్లీ ఇప్పుడు బీసీ వర్గానికే చెందిన సారథిని తొలగిస్తే కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు వ్యతిరేక మన్న సంకేతాలు వెళతాయని ముఖ్యమంత్రి అధిష్ఠానానికి నచ్చచెప్పారు.

దానితో సారథి తాత్కాలికం గా ఊపిరి పీల్చుకోగలిగారు. కేసు నమోదుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆయనకు గండం తప్పేట్లు లేదు. గత ఎన్నికల సమయంలో పార్దసారథి తన కేసు వివ రాలను అఫిడవిట్‌లో పేర్కొన కపోవడం ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరంగా భావించాలని శర్మ ఫిర్యాదు చేశారు. దానిపై కేసు నమోదుచేయాలని భన్వర్‌ లాల్‌ కృష్ణా జిల్లా రిటర్నింగ్‌ అధికారి అయిన కలెక్టర్‌ను ఆదేశించడంతో ఇప్పు డు సారథికి అసలుకే ఎసరు వచ్చినట్ట యింది. దీనివల్ల ఆయన తన పదవి కోల్పోయే అవకాశం కూడా లేక పోలేదని అధికారులు చెబుతున్నారు.

అయితే, రెండేళ్లు ఆపైబడి జైలుశిక్షకు గురయితేనే వాటి వివరాలను ఎన్నికల అఫిడివిట్‌లో పొందుపరచాలన్న ఉద్దేశంతోనే తాను అఫిడవిట్‌ దాఖలు చేయలేదని, తనపై ఉన్నది ఆరు నెలల శిక్ష పడే ఫెరా కేసు అయినందున, అఫిడవిట్‌ దాఖలు చేయ కపోయినా ఫర్వాలేదని సారథి ఇటీవల సీఎంను కలసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో చెప్పారు. కానీ, రాజకీయం గా మాత్రం సారథికి చిక్కులు తప్పేలా లేవు. ఈ విషయంలో ఆయనకు బీసీ కార్డు అక్కరకు రాకపోవచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

పార్థసారథికి వ్యతిరేకంగా ఇప్పటికే కృష్ణా జిల్లా తెలుగుదేశం నాయకులు ఆందోళన కార్యకమ్రాలు ముమ్మరం చేస్తున్నారు. దీనిపై ముఖ్య మంత్రి కిరణ్‌ సైతం ఇరకాటంలో పడిపోయారు. గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ పిటి షన్‌లో న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతా పరెడ్డి పాత్ర ఉందని జైలులో ఉన్న న్యాయమూర్తి స్వయంగా లేఖ రాశారు. మోపిదేవిని అరెస్టు చేసిన ప్రభుత్వం, ఏరాసును విడిచిపెట్ట డంపై బీసీ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు ఆరుగురు మంత్రులకు న్యాయసాయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సార థిపై చర్యలు తీసుకుంటే ఒక సమస్య, విడిచిపెడితే మరొక సమస్య ఎదురుకాక తప్పదన్న సంకటం కిరణ్‌ను వేధిస్తోంది.

English summary

 Minister Parthasarathi is in trouble with the complaint made to the EC by former IAS officer Sharma. Parthasarathi has not mentioned about the FERA violation case in the election affidavit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X