రైలు ప్రమాదం: కూచిపూడి డ్యాన్సర్లు, టెక్కీలు లక్కీ

Tamil Nadu Express fire: dancers get lucky
జయవాడ: కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చిన్నసత్యం అంత్యక్రియలకు హాజరు కావడానికి తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైల్లో బయలుదేరిన డ్యాన్సర్లను అదృష్టదేవత వరించింది. కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామానికి చెందిన ఆరుగురు డ్యాన్సర్లు ఈ రైల్లో చెన్నైకి బయలుదేరారు. రైలులోని ఎస్ -11 బోగీలో రిజర్వేషన్ల కోసం వారు ప్రయత్నించారు. అయితే వారికి రిజర్వేషన్ లభించలేదు. దాంతో వారు జనరల్ కంపార్టుమెంట్లో ఎక్కారు.

నాట్యాచార్యులు చింతా రామమూర్తి, వై శ్రీనివాస్, సిహెచ్ రవి బాలకృష్ణ, పి. బాలరామకృష్ణ, సిహచ్ వి భగత్, చింతా నాగ సత్యనారాయణ మూర్తి రిజర్వేషన్ దొరక్కపోవడంతో జనరల్ కంపార్టుమెంటులో ప్రయాణించారు. ఎస్ -11 బోగీయే మంటల్లో చిక్కుకుని పలువురి ప్రాణాలు తీసింది. దాంట్లో ఆ ఆరుగురు డ్యాన్సర్లకు రిజర్వేషన్ దొరక్కపోవడమే అదృష్టంగా మారింది.

మిత్రురాలి నిశ్చితార్థానికి వచ్చిన హైదరాబాదుకు చెందిన శాలిని అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రైలు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. కరీంనగర్‌లోని మిత్రురాలి నిశ్చితార్థానికి శాలినితో పాటు వరంగల్‌కు చెందిన సింధు (వరంగల్), ప్రశాంతి (ఎస్ఆర్ నగర్, హైదరాబాద్) కూడా వెళ్లారు. రవళి నిశ్చితార్థానికి వెళ్లిన ఆ ముగ్గురు మిత్రులు కూడా చెన్నైకి వరంగల్ నుంచి తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైల్లో టికెట్లు బుక్ చేసుకున్నారు.

ఎస్ -11 బోగీలోని 2,3,4 నెంబర్ల బెర్త్‌లు వారికి రిజర్వయ్యాయి. శాలిని కింది బెర్త్ తీసుకోగా, మిగతా ఇద్దరు పై బెర్త్‌లు తీసుకున్నారు. సింధు, ప్రశాంతి లేచి పరుగు పెడుతూ మరో కంపార్టుమెంటులోకి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. శాలిని మాత్రం తొక్కిసలాటలో పడిపోయి మంటలకు ఆహుతి అయింది. ఆభరణాల ఆధారంగా మిత్రులు శాలినిని గుర్తించారు. శాలినిన తల్లిదండ్రులు హనుమంత రెడ్డి, శోభ. హనుమంత రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. సోదరి స్రవంతి పూణేలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+