వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైరెడ్డితో బాబు మాట్లాడించలేదు: తెలంగాణపై దేవేందర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Devender Goud
నిజామాబాద్: ప్రత్యేక తెలంగాణను అడ్డుకుంది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డియే అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ సోమవారం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకున్న మొట్టమొదటి నేత ఆయనే అని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడితే, ఆ ప్రాంతంలో పర్యటించాలంటే వీసా తీసుకోవాల్సి వస్తుందని గత సాధారణ ఎన్నికల సమయంలో వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో పాగా వేసే కుట్ర పన్నారన్నారు.

అందులో భాగంగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తెలంగాణలో పర్యటించిందని దేవేందర్ గౌడ్ విమర్శించారు. ఇలాంటి సీమాంధ్ర పార్టీలను తెలంగాణలో భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని దొంగ దీక్షలు చేస్తున్నారని, దీన్ని ఈ ప్రాంత ప్రజలు గమనించి, తరిమికొట్టాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రూ.73 వేల కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.

రాష్ట్ర సర్కారు చేపట్టిన జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని, ఈ దోపిడీని అరికట్టేందుకే టిడిపి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా ప్రాజెక్టుల యాత్ర చేపడుతున్నామని దేవేందర్ గౌడ్ తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు చేయూతనివ్వడానికి టిడిపి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని ప్రకటించారు. రాజ్యాధికారంలో బిసిలకు అందరితో సమానంగా పదవులు కట్టబెట్టాలని, కేవలం పింఛన్లు, రెండు రూపాయలకు కిలో బియ్యంతోనే సరిపెట్టకుండా అన్ని సమాన హక్కులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జఠిలమైందని, దీంతో ఎవరికివారు తమ ప్రాంతాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారని దేవేందర్ గౌడ్ తెలిపారు. టిడిపి నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాయలసీమకు చెందిన వ్యక్తి కాబట్టే అలా మాట్లాడారు తప్ప, ఆయనతో తమ పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడించలేదని స్పష్టం చేశారు. ఎవరెన్నీ మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ అధినేత చంద్రబాబు కట్టుబడి ఉన్నారన్నారు. తెలంగాణలో టిడిపిని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషిచేస్తున్నామని దేవేందర్ గౌడ్ తెలిపారు.

English summary

 Telugudesam Party senior leader and Rajyasabha member Devender Goud said that party chief Nara Chandrababu Naidu is not against to Telangana statehood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X