మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు కన్నుమూత

ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు కొద్దికాలం క్రితం ఆకస్మికంగా మృతిచెందారు. కాగా రెండు రోజుల క్రితం రామచంద్రరాజుకు గుండెపోటు రావడంతో భీమవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. సోమవారం పరిస్థితి విషమించడంతో అదే పట్టణంలోని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి కన్నుమూశారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో కొనసాగుతున్న రామచంద్రరాజు 1983 నుండి 2004 వరకు పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో చిన్నతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. తదనంతరం చంద్రబాబు మంత్రివర్గంలో విద్యుత్ శాఖను నిర్వహించారు.
అంతకుముందు కొంత కాలం ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా కూడా పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుండి పరాజయం పొందారు.కలిదిండి రామచంద్ర రాజు ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడి మంత్రివర్గాల్లో లఘు పరిశ్రమలు, విద్యుత్ శాఖలను నిర్వహించారు.












Click it and Unblock the Notifications