హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలోకి టిడిపి మాజీ ఎమ్మెల్యే సంజీవ రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Congress Logo
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యుడు సంజీవ రావు సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెసు, టిడిపి నాయకులు జగన్ పార్టీకి జై కొట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత వైవి సుబ్బా రెడ్డి మాట్లాడారు. రంగారెడ్డి జిల్లాలో ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా అన్నింటిలోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నాయకుల, కార్యకర్తల ఊపు ఉత్సాహం చూస్తూంటే రంగారెడ్డి జిల్లాలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉన్నట్లుగా స్పష్టమవుతోందని సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక సంస్థలు, అసెంబ్లీ.. ఏ ఎన్నికలు వచ్చినా అన్నిస్థానాలూ మన పార్టీకే రావాలని ఆయన వారికి ఉద్బోధించారు. గడప గడపకూ పార్టీని తీసుకువెళ్లాలని, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించి ప్రస్తుతం అవి ఎలా నీరుగారుతున్నాయో కూడా చెప్పాలని ఆయన సూచించారు.

రంగారెడ్డి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ అడ్‌హాక్ కన్వీనర్ జనార్దన్‌ రెడ్డి, మహిళా విభాగం కన్వీనర్ అమృతా సాగర్, ఎస్సీ విభాగం కన్వీనర్ రాచమల్ల సిద్ధేశ్వర్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప రెడ్డి, ట్రేడ్‌యూనియన్ విభాగం కన్వీనర్ జనక్‌ ప్రసాద్‌ల సమక్షంలో కార్యకర్తలందరికీ వైవి పార్టీ కండువాలు కప్పి, స్వాగతం పలికారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలవాలని కార్యకర్తలు కోరగా నెల్లూరు రైలు ప్రమాద బాధితులను పరామర్శించడానికి వెళ్లినందు వల్ల ఆమెను కలుసుకోలేకపోతున్నామని సుబ్బారెడ్డి వారికి వివరించారు.

పార్టీలో చేరిన వారిలో సంజీవ రావు సతీమణి మధురవేణి కూడా ఉన్నారు. సంజీవ రావు మాట్లాడుతూ వైయస్ జీవించి ఉన్నపుడు తనకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే స్వల్ప తేడాతో ఓడిపోయానన్నారు. ఆ తరువాత టిఆర్‌ఎస్‌తో సీట్ల సర్దుబాటు కారణంగా 2004లో టికెట్‌ను కోల్పోయానని తన సతీమణి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారన్నారు. ప్రస్తుతం టిడిపి ఇన్‌చార్జిగా ఉన్న తాను వైయస్సార్ కాంగ్రెస్ మాత్రమే బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి పాటుపడగలదని భావించి పార్టీలో చేరానన్నారు.

1975లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తాను వైయస్ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన నాటి నుంచీ ఆయన నేతృత్వంలో పనిచేస్తూ వస్తున్నాననీ ఆయన ఆశీస్సులతోనే మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కూడా అయ్యానని రామచంద్రారెడ్డి తెలిపారు. ఇక నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పని చేస్తామని చెప్పారు.

English summary
Telugudesam Party former MLA and Vikarabad incharge Sanjeeva Rao has joined in YSR Congress party on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X