ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా పేలుడు: ఒకరి మృతి

కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఢుబ్రీ జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రాంతంలో అల్లర్లు చేలరేగాయి. పరిస్థితిని పరిశీలించడానికి చిదంబరం ఆ ప్రాంతాల్లో పర్యటించారు. గాయపడినవారి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
ఏ గ్రూపు ఈ పేలుడుకు ఒడిగట్టిందనే విషయం తెలియడం లేదు. ఇది ఉగ్రవాద దాడి అయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అల్లర్ల బాధితులను చిదంబరం సోమవారం పరామర్శించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
చిదంబరం హెలికాప్టర్‌లో గౌహతి చేరుకుని టిటాగురి ఉన్నత పాఠశాల పునరావాస కేంద్రంలోని బాధితులను పరామర్శించారు ప్రధాని మన్మోహన్ సింగ్ అంతకు ముందు రెండు రోజుల క్రితం అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి 300 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. ఇదిలా వుంటే, రాష్ట్ర ప్రభుత్వం కోక్రాఝర్, చిరాగ్ జిల్లాల డిప్యూటీ కమీషనర్లపై వేటు వేసింది.












Click it and Unblock the Notifications