చిదంబరానికి ఆర్థికం, సుశీల్ కుమార్ షిండేకు హోం

ప్రస్తుతం చిదంబరం చేతిలో ఉన్న హోం శాఖను విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు అప్పగించారు. వీరప్ప మొయిలీకి అదనంగా విద్యుచ్ఛక్తి శాఖను కేటాయించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఇదిలా వుంటే, షిండేను లోకసభ నేతగా కూడా ఎన్నిక చేసే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే, రాహుల్ గాంధీని లోకసభ నేతగా ఎన్నిక చేయాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల నుంచి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఒత్తిడి వస్తోంది.
రాహుల్ గాంధీ ప్రభుత్వంలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించాలనే ఒత్తిడి పెరుగుతోంది. తాను మరింత పెద్ద పాత్ర నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ కూడా చెప్పారు. స్వల్పంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండవచ్చునని అంటున్నారు. భారీ మార్పులు చేర్పులు మాత్రం వర్షాకాలం పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాతనే ఉంటాయని అంటున్నారు.
చిదంబరం 2008 చివరి వరకు ఆర్థిక శాఖను నిర్వహించారు. ముంబై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో 2008 నవంబర్ లో హోం శాఖను ఆయనకు అప్పగించారు.












Click it and Unblock the Notifications