రాజేష్ ఖన్నా వీలునామా: డింపుల్‌కు మొండిచేయి

Rajesh Khanna
న్యూఢిల్లీ: బాలీవుడ్ తొలి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ఆస్తి విషయంలో డింపుల్ కపాడియాకు మొండిచేయి చూపారు. ఇటీవల మరణించిన రాజేష్ ఖన్నా పెద్ద యెత్తున వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అప్పుడేమీ వివాదాలు లేవు. కానీ క్రమంగా వివాదాలు ముందుకు వస్తున్నాయి. ఆయన రాసిన వీలునామా బయటపడింది.

తన ఆస్తిలో తన భార్య డింపుల్ కపాడియాకు పైసా కూడా ఇవ్వలేదని సమాచారం. రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియా చాలా ఏళ్ల క్రితం విడిపోయారు. అయితే, వారు విడాకులు తీసుకోలేదు. చివరి రోజుల్లో తరుచుగా రాజేష్ ఖన్నా పక్కన డింపుల్ కపాడియా కనిపిస్తూ వచ్చారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, అతని కుమారుడు కూడా రాజేష్ ఖన్నాను జాగ్రత్తగా చూసుకున్నారు.

రాజేష్ ఖన్నా ఆస్తిని తన ఇద్దరు కూతుళ్లు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా పేర్ల మీదనే రాసినట్లు సిఎన్ఎన్ - ఐబియన్ న్యూస్ చానెల్ తెలిపింది. తన సహచరి అనితా అద్వానీకి కూడా ఆయన ఏమీ ఇవ్వలేదని సమాచరాం. అయితే, అనితా అద్వానీ ఆస్తి వద్దని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, అనితా అద్వానీ ఆశీర్వాద్ కోసం నోటీసులు ఇచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

రాజేష్ ఖన్నా అస్తుల్లో ఆశీర్వాద్‌తో పాటు బ్యాంక్ ఖతాలు, ఇతర ఆస్తులు ఉన్నాయి. రాజేష్ ఖన్నా జులై 18వ తేదీన మరణించారు. మరణానికి కొద్ది రోజుల ముందు ఆయన వీలునామా రాసినట్లు చెబుతున్నారు. రాజేష్ ఖన్నా పెద్ద కూతురు ట్వింకిల్ నటుడు అక్షయ్ కుమార్‌ను పెళ్లాడగా, చిన్న కూతురు రింకీ వ్యాపారవేత్త సమీర్ శరన్‌ను పెళ్లి చేసుకుంది. తన కూతుళ్ల పేర్ల మీద రాజేష్ ఖన్నా వదిలి వెళ్లిన భవనాన్ని మ్యూజియంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+