హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఏర్పడితేనే: నాగం, తెస్తామని హామీ.. యాష్కీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ నగారా సమితి చైర్మన్, నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి బుధవారం అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన, జివోల అంశంపై చర్చించేందుకు తెలంగాణ నగారా సమితి ఆధ్వర్యంలో జూబ్లీహాలులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నాగం, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే విద్యార్థులు, ఉద్యోగుల బాధలు తొలగిపోతాయన్నారు. మెడికల్ సీట్లలో తమకు అన్యాయం జరిగిందని, దీనిపై తాము శుక్రవారం గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిస్తామన్నారు. జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళతామని చెప్పారు. అందరం కలిసి పోరాడితే తెలంగాణ వస్తుందని హాజరైన నేతలు అభిప్రాయపడ్డారు.

తెలంగాణ తెస్తామని ప్రజలకు ఖచ్చితంగా చెప్పలేక పోతున్నామని నిజామాబాద్ శాసనసభ్యుడు మధుయాష్కీ వేరుగా అన్నారు. తెలంగాణ ఉద్యమం తగ్గిందని కేంద్రం భావిస్తోందని చెప్పారు. తెలంగాణ కోసం చేపట్టనున్న ఉద్యమంలో తమతో కలిసి మంత్రులు వస్తారో రారో తమకు తెలియదని చెప్పారు.

మెడికల్ సీట్లలో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ అన్నారు. ఐక్య ఉద్యమం ద్వారానే తెలంగాణను సాధించుకోగల్గుతామని చెప్పారు. కాగా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీతో తెరాస సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు భేటీ అయ్యారు.

English summary
Only Telangana statehood is best solution to justice to this region, said Telangana Nagara Samithi chairman on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X